ఎగుమతిదారులకు రూ.7,295 కోట్ల ప్యాకేజీ 

Published on Sat, 01/03/2026 - 05:17

న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు రూ.7,295 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్లు రుణాలపై వడ్డీ రాయితీ పథకానికి, రూ.2,114 కోట్లు రుణ హామీల కోసం కేటాయించింది. తద్వారా ఎగుమతిదారులు సులభంగా రుణాలు పొందగలరని పేర్కొంది. 2025 నుంచి 2031 వరకు ఆరేళ్ల కాలానికి ఈ ప్యాకేజీని తీసుకొచి్చంది. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న నిధుల సమస్యకు ఈ చర్యలు పరిష్కారం చూపిస్తాయని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అజయ్‌ బాడూ పేర్కొన్నారు.

 వడ్డీ రాయితీ పథకం కింద ఎగుమతిదారులు.. ఎగుమతులకు ముందు, తర్వాత తీసుకున్న రుణాలపై వడ్డీ రేటులో 2.75 శాతాన్ని సబ్సిడీ కింద పొందొచ్చు. ఏడాదిలో రూ.50 లక్షల వరకు వడ్డీ రాయితీకి ఒక ఎంఎస్‌ఎంఈకి అర్హత ఉంటుంది. ఒక్కో సంస్థకు రూ.10 కోట్ల వరకు రుణ హామీ కూడా ఈ పథకంలో భాగంగా లభిస్తుంది. 2025 నవంబర్‌లో కేంద్రం రూ.25,060 కోట్లతో ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ను ప్రకటించడం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగానే ఈ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచి్చంది. దీనికి సంబంధించి సవివర మార్గదర్శకాలను ఆర్‌బీఐ విడుదల చేయనుంది. 

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)