ఒక్క కంపెనీ.. 22.55 లక్షల కార్లు!

Published on Fri, 01/02/2026 - 14:51

మారుతి సుజుకి కార్లకు దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ఆదరణ ఉంది. దీంతో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 2025లో ఏకంగా 22.55 లక్షలకు వాహనాలను ఉత్పత్తి చేసింది.

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి.. 2021లో 16.29 లక్షల యూనిట్లను, 2022లో 19.16 లక్షల యూనిట్లను, 2023లో 19.34 లక్షల యూనిట్లను, 2024లో 20.63 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు కంపెనీ గత ఏడాది 22.55 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. దీంతో మారుతి సుజుకి ఉత్పత్తి 20 లక్షల యూనిట్ల మార్కును దాటడం ఇది వరుసగా రెండవ సంవత్సరం.

గత ఏడాది కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లను.. మన దేశంలో విక్రయించడానికి మాత్రమే కాకుండా. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసింది. ఇందులో ఫ్రాంక్స్, బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా మొదలైన మోడల్స్ ఉన్నాయి. కాగా మారుతి సుజుకి ప్రస్తుతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్, ఖార్ఖోడాలలో తయారీ సౌకర్యాలను నిర్వహిస్తోంది.

భారత ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి, ఎగుమతి చేయడానికి కంపెనీ దేశంలోనే తన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తోంది. అంతే కాకుండా మారుతి సుజుకి తన తయారీ సామర్థ్యాన్ని సంవత్సరానికి 40 లక్షల యూనిట్లకు విస్తరించాలని యోచిస్తోంది. ఇదే జరిగితే కార్ల ఉత్పత్తి మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)