కొనసాగిన పండగ సీజన్‌ జోష్‌..

Published on Sun, 12/14/2025 - 04:36

న్యూఢిల్లీ: పండుగలు అయిపోయినప్పటికీ వాహనాలకు సంబంధించి నవంబర్‌లోనూ ఆ జోష్‌ కొనసాగింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు భారీగా డిమాండ్‌ నెలకొంది. జీఎస్‌టీ 2.0 సంస్కరణలు కూడా తోడు కావడంతో హోల్‌సేల్‌ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ గణాంకాల ప్రకారం హోల్‌సేల్‌ డేటాకి తగ్గట్లే ప్యాసింజర్‌ వాహనాలు, త్రీ–వీలర్ల అమ్మకాలు ఉన్నాయి. 

పెళ్లిళ్ల సీజన్‌లో ఏర్పడే డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు.. డీలర్‌íÙప్‌ల దగ్గర స్టాక్స్‌ గణనీయంగా పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, ద్విచక్ర వాహనాల రిజి్రస్టేషన్లు మాత్రం వార్షికంగా 3 శాతం మేర నెమ్మదించాయి. 2024 నవంబర్‌లో 26,27,617 యూనిట్లు రిజిస్టర్‌ కాగా ఈసారి నవంబర్‌లో 25,46,184 యూనిట్లు రిజిస్టర్‌ అయ్యాయి. పండగల నెల కావడంతో అక్టోబర్‌లోనే భారీగా టూ –వీలర్ల కొనుగోళ్లు జరగడం, పంట సంబంధ చెల్లింపుల్లో జాప్యం, కస్టమర్లకు నచి్చన మోడల్స్‌ అందుబాటులో లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమని ఎఫ్‌ఏడీఏ పేర్కొంది.   

బులిష్ గా పరిశ్రమ.. 
పంటల దిగుబడులు పటిష్టంగా ఉండటం, పెళ్లిళ్ల సీజన్‌లాంటి అంశాల దన్నుతో టూ–వీలర్లతో పాటు మిగతా వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరుగుతాయని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ సీఎస్‌ విఘ్నేశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున పాలసీపరమైన సంస్కరణలు, మార్కెట్‌ సెంటిమెంట్లు మెరుగుపడటం లాంటి అంశాల మద్దతుతో వచ్చే ఏడాది కూడా ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని పరిశ్రమ ఆశిస్తున్నట్లు సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ చెప్పారు. అమ్మకాలపరంగా ఈసారి నవంబర్‌ తమకు అత్యుత్తమ నెలగా గడిచిందని ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ తెలిపింది.

 ‘‘గత 40 ఏళ్లలో (కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి) నవంబర్‌ నెలకు సంబంధించి ఈ ఏడాది అత్యుత్తమంగా గడిచింది. గత నెలలో అత్యధికంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి’’ అని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. తమ రిటైల్‌ అమ్మకాలు 31% పెరిగినట్లు వివరించారు. అలాగే ఎనిమిది మోడల్స్‌ విషయంలో ఫ్యాక్టరీ స్థాయిలో కూడా నిల్వలు లేకుండా పూర్తిగా అమ్ముడైపోయినట్లు పేర్కొన్నారు. ఇక చిన్న కార్ల (4 మీటర్ల లోపు పొడవు, 18 శాతం ట్యాక్స్‌ రేటు వర్తించేవి) సంగతి తీసుకుంటే అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 38 శాతం పెరిగాయని బెనర్జీ చెప్పారు. అలాగే పెద్ద కార్ల (40 శాతం పన్ను రేటు వర్తించేవి) విక్రయాలు 17 శాతం పెరిగాయని వివరించారు.  

పెండింగ్‌లో లక్షన్నర బుకింగ్స్‌ ..  
మారుతీ సుజుకీ దగ్గర 1,50,000 వాహనాలకు బుకింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల దగ్గర మరో 1,20,000 యూనిట్లు ఉన్నాయి. వెయిటింగ్‌ పీరియడ్‌లను తగ్గించేందుకు, సకాలంలో వాహనాలను డెలివరీ చేసేందుకు సెలవు రోజుల్లో కూడా సిబ్బంది పని చేస్తున్నట్లు బెనర్జీ వివరించారు. డిసెంబర్‌లో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. అటు టాటా మోటర్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా తదితర దిగ్గజాలు కూడా నవంబర్‌లో భారీ అమ్మకాలు నమోదు చేశాయి. టాటా మోటర్స్‌ అమ్మకాలు 
22 శాతం పెరిగి 57,436 యూనిట్లకు చేరాయి.

 

Videos

ఆస్ట్రేలియా లో కాల్పులు.. 10 మంది మృతి

లోకేష్.. నీ జాకీలు తుస్..

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి 31 సీట్లే.. IITians సంచలన సర్వే రిపోర్ట్!

నెలకు రూ.2000 పొదుపుతో.. రూ. 5 కోట్లొచ్చాయ్

అప్పుడే 2027 పొంగల్ పై..! కన్నేసిన సీనియర్ హీరోస్

భార్యను హత్య చేసి బైక్ పై మృతదేహాన్ని..

అనకొండ అవులిస్తే...!

బంగారుకొండ.. మానుకొండ.. మరో వీడియో రిలీజ్ చేసిన కొలికపూడి

ముంచుకొస్తున్న ప్రళయం.. డేంజర్ లో ఆ 5 దేశాలు!

సర్పంచ్ అభ్యర్థుల మధ్య గొడవ.. నేతల కొట్లాట

Photos

+5

సింగర్ స్మిత 'మసక మసక' సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే లవర్.. భర్తకు హీరోయిన్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ డేట్ లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లయి ఏడాది.. కీర్తి సురేశ్ ఇంత హంగామా చేసింది? (ఫొటోలు)

+5

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 14-21)

+5

టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి బర్త్ డే స్పెషల్(గ్యాలరీ)

+5

ఉప్పల్‌.. ఉర్రూతల్‌.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్‌ (ఫొటోలు)

+5

పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ ఆదా శర్మ.. ఫోటోలు

+5

మెస్సీ మ్యాచ్‌.. ఫ్యాన్స్‌ జోష్‌! (ఫొటోలు)