Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి
Breaking News
తక్కువ ధరలో వచ్చేసిన స్మార్ట్ ఫోన్, ట్యాబ్..
Published on Sun, 12/07/2025 - 08:16
రెడ్‌మీ తాజాగా ‘రెడ్‌మీ 15సీ’ పేరుతో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. 6.9 అంగుళాల హెచ్‌డీ అడాప్టివ్‌సింక్ డిస్‌ప్లే, డస్ట్ .. వాటర్ రెసిస్టెన్స్, 50 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, (33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్) దీని ప్రత్యేకతలు.

మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ బ్లూ, డస్క్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి రెండేళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇస్తారు. ధరల విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ రేటు రూ.12,499గా ఉంది. అలాగే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 13,999గా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 15,499గా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 వచ్చేసింది
దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ భారత్‌లో తన కొత్త ‘‘గెలాక్సీ ట్యాబ్ ఏ11’’ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇందులో 8.7 అంగుళాల స్క్రీన్, 5100ఎంఏహెచ్ బ్యాటరీ, 6 ఎన్‌ఎం ఆధారిత ఆక్టా–కోర్ ప్రాసెసర్, 5ఎంపీ కెమెరా, 8జీబీ వరకు ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

పెద్ద ఫైల్స్‌కు తగినంత స్థలాన్ని చేకూర్చుకునేందుకు 128జీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో 2టీబీ వరకు విస్తరించకోవచ్చు. క్లాసిక్ గ్రే, సిల్వర్ రంగులలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999 (4జీబీ ర్యామ్ + 64జీబీ)కాగా, గరిష్ట ధర రూ.20,999 (8జీబీ ర్యామ్ + 128 బీజీ)గా ఉంది. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లతో పాటు శాంసంగ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
Tags : 1