పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు
Breaking News
పిల్లలను ఏ వయసులో కంటే మంచిది?!
Published on Sat, 11/22/2025 - 10:58
ఏ వయసుకు ఆ ముచ్చట అంటుంటారు పెద్దలు. పెళ్లి, పిల్లల విషయంలోనే ఈ ప్రస్తావనను తీసుకు వస్తుంటారు. కానీ, మారిన రోజులు స్త్రీని తన కెరీర్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం, సరైన భాగస్వామి.. ఈ ఎంపికలతో పెళ్లి, పిల్లలను కనడం సాధారణంగానే ఆలస్యం అవుతోంది. ఇవి అమ్మాయిల ఆరోగ్యరీత్యా, సామాజిక రీత్యా ఇబ్బందులకు లోనయ్యే అంశం అని సర్వత్రా వినిపిస్తున్న మాటలు. ఇటీవల ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించిన ఉ΄ాసన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
‘పెళ్లి చేసుకుంటున్నారా...?!’ అని అడిగిన ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేతులు పైకెత్తారని, మహిళలు కెరీర్‌ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టారని దీనిని బట్టి అర్ధమైంది. ఇది సరికొత్త భారత్’ అని పోస్ట్‌లో ఉ΄ాసన పేర్కొన్నారు. అమ్మాయిలు తమ అండాలను మెడికల్ పద్ధతిలో ఫ్రీజ్ చేసుకోవచ్చని, ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవడం మంచిదని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీనిపై ఎంతోమంది నెటిజన్లు తమ భిన్నాభి్ర΄ాయాలను వెలిబుచ్చారు. దీనిపై ఉపాసన రియాక్ట్ అవుతూ మరో పోస్టు పెట్టారు. ‘నా దృష్టిలో పెళ్లి, కెరీర్ ఒకదానితో మరొకటి పోటీ కాదు. కానీ, ప్రతిదానికీ ప్రత్యేక సమయం ఉంటుందని భావిస్తున్నా. సరైన భాగస్వామి ఎదురయ్యే వరకు అమ్మాయి వేచి చూడటం తప్పా? పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్పా ?’ అంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా ఏ వయసులో పిల్లలకు జన్మనివ్వడం మంచిది, దీనిపైన నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఒక అవకాశం మాత్రమే!
దేనికుండే అవకాశాలు దానికి ఉన్నాయి. 30 ఏళ్లు దాటక ముందే పిల్లలను కనడం మంచిదే. 35 ఏళ్ల తర్వాత అంటే కష్టం. ఈ వయసులో అండాల విడుదల వేగం తగ్గిపోతుంటుంది. ప్రీ మెనోపాజ్ సమస్యలు తలెత్తుతుంటాయి. కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని... పెళ్లి, పిల్లల సంగతి తర్వాత చూద్దాం అనుకున్న అమ్మాయిలు వయసులో ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు చికిత్సలు తీసుకుంటున్నవారూ ఈ పద్ధతిని అనుసరించవచ్చు. అందరూ చేయించుకోవాలనేం లేదు. అండాన్ని నిల్వ చేయడానికి ముందు చేసే మెడికల్ ప్రాసీజర్ కాస్ట్, ఎగ్ ఫ్రీజింగ్‌కి ఫీజు చెల్లించి, ప్రతియేడూ రెన్యువల్ చేసుకోవచ్చు. అయితే, ఇది ఒక ఆప్షన్ మాత్రమే. బయలాజికల్‌గా పిల్లలను కనడమే సరైన పద్ధతి. ఏదైనా సమస్యను అధిగమించేంతవరకే ఆలోచించాలి. కొంతమంది అమ్మాయిలు పై చదువులకు, ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లాలి అనే ఆలోచనలో ఉంటారు.
ఇలాంటప్పుడు పెళ్లి, పిల్లలను కనడంలో ఆలస్యం అవుతుంటుంది. తమ లక్ష్యంపై ఫోకస్ చేసుకోవడానికి ఎగ్ ఫ్రీజ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రీజింగ్ టెక్నాలజీ ఉన్నప్పటికీ సక్సెస్ రేట్ వంద శాతం ఎప్పుడూ ఉండదు. వందమందికి ఐవిఎఫ్ చేస్తే పది శాతం సక్సెస్ కావచ్చు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం అమ్మాయిలు 21 ఏళ్ల నుంచి ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. 35 ఏళ్ల తర్వాత ఎగ్ ఫ్రీజింగ్ అంటే దాని సక్సెస్ రేట్ ఊహించలేం. విదేశాలలో కొన్ని ఆఫీసులలో తమ మహిళా సిబ్బందికి కంపెనీలే ఎగ్ ఫ్రీజింగ్ వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీర్ఘకాలం కాకుండా నిర్ణీత సమయంలో తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనేవారికి ఇదొక అవకాశం మాత్రమే.
– డాక్టర్ సుధారాణి బైర్రాజు, ఇన్‌ఫెర్టిలిటీ (ఐవిఎఫ్) స్పెషలిస్ట్,
Tags : 1