పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు
Breaking News
రూపాయి భారీ క్రాష్..!
Published on Sat, 11/22/2025 - 04:00
ముంబై: చరిత్రలో అత్యంత కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. జాతీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కె ట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఒక్కరోజులో అత్యధికంగా 98 పైసలు కుప్పకూలి చరిత్రాత్మక కనిష్టం 89.66 స్థాయి వద్ద ముగిసింది. అంతకుముందు అక్టోబర్ 14న 88.91 జీవితకాల కనిష్టంగా ఉంది. అంతర్జాతీయ టెక్నాలజీ షేర్లలో అనూహ్య అమ్మకాలు, అమెరికా–భారత్‌ల వాణిజ్య డీల్‌పై స్పష్టత లేమి కూడా రూపాయి కోతకు కారణమయ్యాయి.
ఇంట్రాడేలో 97 పైసలు క్షీణించి 89.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న 88.85 వద్ద ఇంట్రాడేలో రికార్డు కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. అలాగే జూలై 30న ఒక్కరోజులో 89 పైసల పతన రికార్డునూ చెరిపివేసింది. ‘క్రిప్టో భారీ పతనం, ఏఐõÙర్లలో వెల్లువెత్తిన విక్రయాలతో అంతర్జాతీయంగా కరెన్సీ మార్కెట్లలో రిస్క్ సామర్థ్యం ఒక్కసారిగా తగ్గింది. ఈ పరిమాణం భారత్ వంటి వర్ధమాన దేశాల కరెన్సీలపై తీవ్ర ఒత్తిడి పెంచింది’ అని ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ అండ్ కమోడిటీ, కరెన్సీ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు.
Tags : 1