Breaking News

మహిళల మానసిక ప్రపంచంలోకి...

Published on Fri, 11/21/2025 - 00:45

ఉత్తరాన కశ్మీర్‌ నుండి దక్షిణాన మలయాళం వరకు, పశ్చిమాన రాజస్థానీ నుంచి తూర్పున అస్సామీ వరకు ‘బ్యాండెజ్ట్‌ మూమెంట్స్‌’ పుస్తకంలో ఎంతోమంది మహిళల గొంతులు వినిపిస్తాయి. మానసిక ఆరోగ్యం నుంచి సామాజిక శ్రేయస్సు వరకు ఎన్నో అంశాలపై పదిహేను భారతీయ భాషలలో, మూడు మాండలికాలలో (మార్వారీ, మాగహి, భోజ్‌పురి) మహిళలు రాసిన కథల ఇంగ్లీష్‌ అనువాదం... బాండెజ్ట్‌ మూమెంట్స్‌ పేరుతో ముందుకు వచ్చింది.

ఉపాధ్యాయులైన ఇద్దరు మహిళలు ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. పేదరికం మాత్రమే కాదు మానసిక అనారోగ్యం కూడా పెద్ద సమస్యే అని చెబుతాయి ఈ పుస్తకంలోని కథలు. ఆందోళన, నిరాశ, అబ్సెసివ్‌–కంపల్సివ్‌ డిజార్డర్‌ (వోసిడి), స్కిజోఫ్రేనియా...మొదలైన వాటి గురించి రచయిత్రులు తమ జీవితానుభవాల నుంచి చెప్పిన కథలు ఇందులో ఉన్నాయి.

గ్లాస్‌ వాల్స్‌ (తమిళ్‌), ప్లైయింగ్‌ షిష్‌ (అస్సామీ), ది టేల్‌ ఆఫ్‌ ది టాయిలెట్‌ (కన్నడ), కన్వర్ట్‌ మై బ్యాడ్‌ కర్మ టు గుడ్‌ (హిందీ)... మొదలైన కథలు స్త్రీలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల గురించి రాసినవే.

మానసిక ఆరోగ్యం కూడా ఒక సామాజిక సమస్య అని, అది వివక్షతకు గురవుతుందని చెప్పే కథలు... ఓ మై టెనిఫాక్టర్‌ (మైథిలి), గర్ల్‌ ఇన్‌ ది డాల్‌హౌస్‌ (పంజాబీ)... మొదలైనవి.

అబ్సెషన్‌ అనేది వ్యక్తి యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. విసియస్‌ సైకిల్‌ (గుజరాతి), ది స్మెల్‌ ఆఫ్‌ న్యూస్‌ (మలయాళం), బ్రేకింగ్‌ అవుట్‌ (ఉర్దూ), బోర్డర్‌ లైన్‌ (బెంగాలీ) అనేవి అబ్సెషన్‌ కేంద్రంగా నడిచే కథలు. క్రేజీ రివర్‌ (ఒడియా) అనేది మాట్లాడాలనే కోరికను, ఉత్సాహాన్ని కోల్పోయిన మహిళ కథ. ది షాడో (ఒడియా) ఒక మహిళ మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణించడాన్ని గురించి చెబుతుంది. ది ఎల్లో రోజ్‌ (ఉర్దూ) మానసిక సమస్యల్లో ఉన్న వారి ఒంటరితనం గురించి చెబుతుంది.
 

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)