Breaking News

ఈసారి ఎయిర్‌లైన్స్‌ నష్టాలు రెట్టింపు 

Published on Thu, 11/20/2025 - 01:25

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు నికరంగా రూ. 9,500 కోట్ల–రూ. 10,500 కోట్ల మేర ఉండొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన సుమారు రూ. 5,500 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపు స్థాయిలో ఉండొచ్చని ఒక నివేదికలో తెలిపింది. 

ప్రధానంగా ప్యాసింజర్ల వృద్ధి నెమ్మదించడం, విమానాల డెలివరీలతో ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంలాంటి అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తాయని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ప్యాసింజర్ల ట్రాఫిక్‌ వృద్ధి 4–6 శాతం మేర ఉంటుందని తెలిపింది. అయితే, ఆర్థికంగా పరిశ్రమపై ఒత్తిడి నెలకొంటుందని నివేదిక పేర్కొంది. కానీ, 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా నమోదైన రూ. 21,600 కోట్లు, రూ. 17,900 కోట్లతో పోలిస్తే తాజా ఆర్థిక సంవత్సరంలో నష్టాలు తక్కువ స్థాయిలో ఉంటాయని తెలిపింది.  

గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ 7.6 శాతం వృద్ధి చెంది, 16.53 కోట్లకు చేరింది. అక్టోబర్‌లో దేశీయంగా విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌ 1.43 కోట్లుగా నమోదైంది. వార్షికంగా 4.5 శాతం, నెలలవారీగా సెపె్టంబర్‌తో పోలిస్తే 12.9 శాతం పెరిగింది. కానీ సీమాంతర ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా అవాంతరాలు, 2025 జూన్‌లో విమాన దుర్ఘటన తర్వాత ప్రయాణాలు చేయడంపై సందేహాలు నెలకొనడంలాంటి అంశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వృద్ధి ఒక మోస్తరుగానే ఉండొచ్చని నివేదిక వివరించింది. ఇక సరఫరా వ్యవస్థపరమైన అవరోధాలు, ఇంజిన్‌ వైఫల్యాల వల్ల విమానాలు ఎగరలేని పరిస్థితులు మొదలైన అంశాలు పరిశ్రమకు ప్రతికూలంగా ఉంటున్నాయని పేర్కొంది. 2025 మార్చి 31 నాటికి వివిధ కంపెనీలకు చెందిన 133 విమానాలు పక్కన పెట్టాల్సి వచి్చందని, మొత్తం పరిశ్రమ ఫ్లీట్‌లో ఇది 15–17 శాతమని నివేదిక వివరించింది. నిర్వహణపరమైన సవాళ్ల వల్ల ఎయిర్‌లైన్స్‌ వ్యయాలు 
పెరిగిపోయాయని పేర్కొంది.  
 

Videos

అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం

జగన్ కోసం తండోపతండాలుగా జనాలు... ABN, TV5 థంబ్ నైల్స్ పై అంబటి మాస్ ర్యాగింగ్

Hyd: స్టేట్ ఏదైనా తగ్గని జగన్ క్రేజ్

జలుబు, దగ్గు, గొంతు నొప్పికి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా?

Tripura: పికప్ వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు

రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ధార్మిక సంఘాలు

Devabhaktuni: ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వస్తుంటే చంద్రబాబు నిద్రపోతున్నారా..

ఎల్లో మీడియా విషపు రాతలు... ఇచ్చిపడేసిన జూపూడి

Corporator Sravan: చెరువులో దూకి కార్పొరేటర్‌ ఆత్మహత్యాయత్నం

Raja Singh: నీ లాంటి ఫాల్తూ డైరెక్టర్ ని ! జైల్లో వేసి..!!

Photos

+5

గ్రాండ్‌గా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా.. హాజరైన సినీతారలు (ఫోటోలు)

+5

భర్తతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోన్న అమలాపాల్ (ఫోటోలు)

+5

సిస్టర్‌ శిల్పా శిరోద్కర్ బర్త్‌డే.. చెల్లిపై నమ్రతా ప్రశంసలు (ఫోటోలు)

+5

రివాల్వర్ రీటా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. (ఫోటోలు)

+5

వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న సాయి పల్లవి సిస్టర్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌కు జగన్‌.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)