Breaking News

సైబర్‌ ముప్పులపై కార్పొరేట్లలో ఆందోళన 

Published on Thu, 11/20/2025 - 01:04

ముంబై: నిపుణుల కొరత, నియంత్రణలపరమైన సంక్లిష్టత, డిజిటల్‌ సవాళ్ల నడుమ సైబర్‌ ముప్పులు, డేటా గోప్యతను ఈ ఏడాది అత్యంత రిస్కీ వ్యవహారాలుగా దేశీ కంపెనీలు భావిస్తున్నాయి. సైబర్‌ దాడులు, డేటా చౌర్యం భయాలు టాప్‌ రిస్క్ గా కొనసాగుతుండగా, తాజాగా డేటా గోప్యత నిబంధనలు కూడా ఆ జాబితాలోకి చేరినట్లు అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ సర్వీసుల సంస్థ ఏయాన్‌ ఒక సర్వే నివేదికలో తెలిపింది. 

ప్రతిభావంతులను నియమించుకోవడం, వారు కంపెనీని వీడిపోకుండా చూసుకోవడానికి సంబంధించిన సవాళ్లు కొనసాగుతున్నాయని వివరించింది. ఆసియాలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ’ప్రాపర్టీ నష్టాలు’, ’విదేశీ మారకం రేటులో ఒడిదుడుకుల’ రిస్క్ లు చాలా ఎక్కువగా ఉంటున్నట్లు వివరించింది. ఇలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనడంలో భారతీయ కంపెనీలు విశేషంగా రాణిస్తున్నాయని ఏయాన్‌ సీఈవో (ఇండియా) రిషి మెహ్రా తెలిపారు. 

 సైబర్‌ దాడులు, డేటా గోప్యత రిస్క్ ల పెరుగుతున్న కొద్దీ వాటిని దీటుగా ఎదుర్కొనేలా కంపెనీలు తమ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని మెహ్రా పేర్కొన్నారు. ఇందుకోసం పటిష్టమైన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యూహాలపై గణనీయంగా ఇన్వెస్ట్‌ చేయడం, పురోగామి ఆలోచనా ధోరణిని పెంపొందించుకోవడం ద్వారా సంక్లిష్టమైన పరిస్థితుల నుంచి భారతీయ కంపెనీలు బైటపడగలవని, దీర్ఘకాలికంగా విజయాలు సాధించేందుకు తమను తాము సిద్ధం చేసుకోగలవని వివరించారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ సర్వేలో భారత్‌ సహా 63 దేశాల నుంచి 3,000 మంది పైగా రిస్క్‌ మేనేజర్లు, చీఫ్‌ల హోదా  గల ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు.

#

Tags : 1

Videos

అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం

జగన్ కోసం తండోపతండాలుగా జనాలు... ABN, TV5 థంబ్ నైల్స్ పై అంబటి మాస్ ర్యాగింగ్

Hyd: స్టేట్ ఏదైనా తగ్గని జగన్ క్రేజ్

జలుబు, దగ్గు, గొంతు నొప్పికి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా?

Tripura: పికప్ వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు

రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ధార్మిక సంఘాలు

Devabhaktuni: ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వస్తుంటే చంద్రబాబు నిద్రపోతున్నారా..

ఎల్లో మీడియా విషపు రాతలు... ఇచ్చిపడేసిన జూపూడి

Corporator Sravan: చెరువులో దూకి కార్పొరేటర్‌ ఆత్మహత్యాయత్నం

Raja Singh: నీ లాంటి ఫాల్తూ డైరెక్టర్ ని ! జైల్లో వేసి..!!

Photos

+5

గ్రాండ్‌గా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా.. హాజరైన సినీతారలు (ఫోటోలు)

+5

భర్తతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోన్న అమలాపాల్ (ఫోటోలు)

+5

సిస్టర్‌ శిల్పా శిరోద్కర్ బర్త్‌డే.. చెల్లిపై నమ్రతా ప్రశంసలు (ఫోటోలు)

+5

రివాల్వర్ రీటా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. (ఫోటోలు)

+5

వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న సాయి పల్లవి సిస్టర్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌కు జగన్‌.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)