గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే
ఏఐతో టాప్: గూగుల్ ప్లేలో బెస్ట్ యాప్‌లు ఇవే..
Published on Wed, 11/19/2025 - 12:18
టెక్నాలజీ పెరిగి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక అన్నీ సులభమైపోయాయి. ప్రతి అంశానికీ, పనికీ పదుల సంఖ్యలో మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.. వస్తున్నాయి. ఇలా వేలకొద్దీ యాప్‌లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ అయిన గూగుల్ ప్లే 2025 ఏడాదికిగానూ ఉత్తమ యాప్‌లను ప్రకటించింది.
గూగుల్ ప్లే యాప్ స్టోర్‌లో 2025లో అందుబాటులో ఉన్న యాప్‌లలో గేమ్స్, పర్సనల్ గ్రోత్, ఎవ్రీడే ఎషన్షియల్.. ఇలా ఒక్కో అంశానికీ కొన్ని ఉత్తమ యాప్‌లను పేర్కొంటూ జాబితాను విడుదల చేసింది. వీటిలో ఏఐ అనుసంధానిత యాప్‌లదే పైచేయి. ఉదాహరణకు ఓవరాల్ బెస్ట్ యాప్‌గా జొమాటోకు చెందిన సోషల్ యుటిలిటీ యాప్ ‘డిస్ట్రిక్ట్’ నిలిచింది. ఇది ఏఐని వినియోగించి వినియోగదారుల అభిరుచులను విశ్లేషించి డైనింగ్‌తో పాటు ఈవెంట్లు, సినిమా టికెట్ల బుకింగ్ వంటి సోషల్ యుటిలిటీ సేవలు రియల్ టైమ్ సమాచారంతో అందిస్తోంది.

ఇక పర్సనల్ గ్రోత్ విభాగంలో ‘ఇన్‌వీడియో ఏఐ’ అత్యుత్తమ యాప్‌గా నిలిచింది. దీంతో టెక్ట్స్ రూపంలో ప్రాంప్ట్ ఇచ్చి నేరుగా మంచి మంచి వీడియోలు రూపొందించవచ్చు.
బెస్ట్ హిడెన్ జెమ్‌గా టూన్‌సూత్ర అనే యాప్‌ను గూగుల్ ప్లే పేర్కొంది. ఇది ఏఐ-ఆధారిత సినిమాటిక్ మోడ్ ను ఉపయోగించి భారతీయ ప్రసిద్ధ కథలను డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆసక్తికరంగా మారుస్తుంది.
ఫోటో ఎడిటింగ్, నోట్స్ రూపొందించడం వంటి వాటిలో సాయమందించే గుడ్ నోట్స్, లుమినార్ యాప్‌లు ఉత్పాదకత విభాగంలో ఉత్తమంగా నిలిచాయి. ఇవి ఏఐ ఫీచర్లతో ఫొటో ఎడిటింగ్, నోట్స్ టేకింగ్‌ను సులభతరం చేస్తున్నాయి.
వ్యక్తగత ఆరోగ్య సంరక్షణ, జీవనశైలికి సంబంధించిన అంశాల్లోనూ కొన్ని యాప్‌లు ఏఐ వినియోగాన్ని విస్తరిస్తున్నాయి. అలాంటివాటిలో ఉత్తమమైనవే డైలీప్లానర్, స్లీపిసోల్‌బయో యాప్‌లు.
ఇక గేమింగ్ విషయానికి వస్తే లెక్కలేనన్నీ ఆండ్రాయిడ్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఏఐ ఫీచర్లతో లోకల్ ఫ్లేవర్ జోడించిన యాప్లకు మంచి ఆదరణ ఉంటోంది. అలాంటి యాప్లే కుకీరన్ ఇండియా, కమలా, రియల్ క్రికెట్ స్వప్ వంటివి.
గూగుల్ కొత్తగా టాప్ ట్రెండింగ్ కేటగిరీని కూడా ప్రవేశపెట్టింది. ఇందులో ఇన్స్టామార్ట్, సీఖో, అడోబ్ ఫైర్ ఫ్లై వంటి యాప్లు బెస్ట్గా నిలిచాయి.
ఆవిష్కరణ, నాణ్యత, యూజర్ ఇంపాక్ట్, సాంస్కృతిక ఔచిత్యం, ఏఐ-ఆధారిత ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ బెస్ట్ యాప్లను గూగుల్ ప్లే ఎంపిక చేసింది. రోజువారీ ఉపయోగం, స్థానికతను జోడించడం, వివిధ రకాల ఫోన్లు, డివైజ్లలో వినియోగించగల వెసులుబాటు ఉన్న యాప్లను హైలైట్ చేసింది. వాస్తవానికి, 69 శాతం మంది భారతీయ యూజర్లు ఏఐతో తమ మొదటి ఎక్స్పీరియన్స్ ఆండ్రాయిడ్ యాప్‌ల ద్వారానే పొందుతున్నారని గూగుల్ తన బ్లాగ్లో పేర్కొంది.
Tags : 1