3 నెలల్లో 10.39 లక్షల వాహనాలు సేల్‌..

Published on Wed, 11/19/2025 - 08:02

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ (క్యూ2)లో ప్యాసింజర్, వాణిజ్య వాహన విక్రయాల పరంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచినట్లు భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య(సియామ్‌) తెలిపింది. ద్వి చక్రవాహన, త్రీ వీలర్స్‌ వాహన అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్‌ ప్రథమస్థానంలో ఉన్నట్లు పేర్కొంది.

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ త్రైమాసికంలో మొత్తం 10.39 లక్షల ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడవగా, అందులో వెస్ట్రన్‌ జోన్‌(మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, గోవాలతో పాటు కేంద్ర ప్రాంతాలు దాద్రానగర్‌ హవేలీ, డయ్యూ డామన్‌)లో 3.44 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే క్యూ2లో మొత్తం 2.40 లక్షల యూనిట్లు వాణిజ్య వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో వెస్ట్రన్‌ జోన్‌లో అత్యధికంగా 92,000 యూనిట్లు సీవీల విక్రయాలు జరిగాయి. సియామ్‌ గణాంకాలు పరిశీలిస్తే...  

  •     ఇదే ప్యాసింజర్‌ వాహన విభాగంలో రాష్ట్రాల పరంగా 1.31 లక్షల యూనిట్లతో మహారాష్ట్ర తొలిస్థానాన్ని దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్‌ 1.00 లక్షలు, గుజరాత్‌ 87,901 యూనిట్లు తరువాత ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో కర్ణాటక 76,422 యూనిట్లు, కేరళ 69,609 యూనిట్లతో అయిదో స్థానంలో కొనసాగుతున్నాయి.

  •     వాణిజ్య వాహన విక్రయాల్లోనూ 37,091 యూనిట్లతో మహారాష్ట్ర హవా కొనసాగింది. గుజరాత్‌ 22,491 యూనిట్లు, ఉత్తరప్రదేశ్‌ 19,009 యూనిట్లు, తమిళనాడు 18,508 యూనిట్లు, మహారాష్ట్ర 16,743 యూనిట్లతో తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.  

  •     సెప్టెంబర్‌ త్రైమాసికంలోనే దేశవ్యాప్తంగా 55.62 లక్షల టూ వీలర్స్‌ అమ్ముడయ్యాయి. ఇందులోనూ 19.33 లక్షల యూనిట్లతో వెస్ట్రన్‌ జోన్‌ ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్‌(6.92 లక్షలు) ప్రథమ స్థానం దక్కించుకుంది. మహారాష్ట్ర(6.29 లక్షలు), గుజరాత్‌(4.45 లక్షలు), తమిళనాడు(3.98 లక్షలు), రాజస్తాన్‌(3.60 లక్షలు) తరువాత స్థానాల్లో నిలిచాయి.

  •     దేశ వ్యాప్తంగా క్యూ2లో మొత్తం 2.29 లక్షల త్రి చక్రవాహనాలు అమ్ముడయ్యాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, కేరళ, ఏపీతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు పాండిచ్చేరి, లక్షదీ్వప్‌లో 77,00 యూనిట్లు విక్రయాలు జరిగాయి. రాష్ట్రాల వారీగా ఈ విభాగంలో 28,246 యూనిట్ల అమ్మకాలతో ఉత్తరప్రదేశ్‌ ప్రథమస్థానంలో ఉంది. తెలంగాణ (26,626 యూనిట్లు), గుజరాత్‌ (22,572 యూనిట్లు), మహారాష్ట్ర(21,100 యూనిట్లు), తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
     

Videos

గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే

ఇవ్వాల్సింది 40K.. ఇచ్చింది 10K.. రైతును ముంచేసిన చంద్రబాబు

నిద్రలేచిన అగ్నిపర్వతం.. ఆ దేశం తగలపడుతుందా?

అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

త్వరగా అరెస్ట్ చేయండంటూ పోలీసులకు ఫోన్ ల మీద ఫోన్ లు.. వెంకట్ రెడ్డి సంచలన నిజాలు

తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్

iBomma రవి చేసింది పైరసీ కాదు? సినిమా ఇండస్ట్రీ వాళ్లే పెద్ద క్రిమినల్స్

ఇవాళ బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం..

అయ్యప్ప భక్తులకు కొత్త రూల్స్.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు

తిక్క కుదిరిందా..! ఇకనైనా మారు బాబు

Photos

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)

+5

తెలుసు కదా మూవీ సెట్‌లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

సినిమా పైరసీపై ఫిల్మ్‌ ఛాంబర్‌ మహా ధర్నా (ఫోటోలు)

+5

జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో బిగ్‌బాస్ సోనియా.. లేటేస్ట్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా?

+5

ముత్యపు పందిరి వాహ‌నంపై అమ్మవారు

+5

“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)