29వ సీటు నుంచి 11వ సీటుకు సతీష్ లగేజీ
Breaking News
వెబ్‌సైట్‌లో మాయమైన రెండు హోండా బైకులు
Published on Sun, 11/16/2025 - 20:56
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) కొత్తగా విడుదల చేసిన CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ SP & రెబెల్ 500 మోడళ్లను అధికారిక వెబ్‌సైట్ తొలగించింది. ఈ బైకులను ఎందుకు తొలగించిందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. మార్కెట్లో సరైన అమ్మకాలు పొందకపోవడం వల్లనే.. కంపెనీ బహుశా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ SP
హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ SP అనేది 999 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 215 hp & 113 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. అంతే కాకుండా రైడ్-బై-వైర్ థ్రోటిల్‌తో పాటు బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను కలిగిన ఈ బైక్ లైట్ వెయిట్ అల్యూమినియం డైమండ్ ఫ్రేమ్ పొందుతుంది. దీని ధర రూ. 28.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
హోండా రెబెల్ 500
హోండా రెబెల్ 500 ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, గురుగ్రామ్). ఇది 471 సీసీ లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, 8-వాల్వ్ పారలల్ ట్విన్-సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 45.60 hp & 43.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో షోవా డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు, వెనుక వరుసగా 296 mm & 240 mm డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది.
Tags : 1