Breaking News

ఇంట్లో ఇల్లాలు.. అద్దె ఇంట్లో ప్రియురాలు

Published on Sun, 11/16/2025 - 10:50

సిరిసిల్లకు చెందిన అతను ప్రముఖ వ్యాపారి కొడుకు. అతనికి మరో ప్రముఖ వ్యాపారి తన కూరుతు ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి ఇద్దరు పిల్లలు. సదరు యువకుడు వారి ఇంట్లో అద్దెకుండే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు. ఇంటి యజమాని చూపించిన ప్రేమతో ఆ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి, వ్యాపారి కొడుకుతో సహజీవనానికి సిద్ధమైంది. ఈ విషయం తెలియడంతో వ్యాపారి కుటుంబ సభ్యులకు మానసిక వేదన మొదలైంది. అతని భార్య పుట్టింటికి చేరింది. సదరు మహిళను ఇల్లు ఖాళీ చేయించారు. కానీ ఆ ఇంటి ముందే మరో ఇంట్లో అద్దెకుంటూ నీతోనే ఉంటానంటూ స్పష్టం చేసింది. సదరు వ్యాపారి రెండు వైపులా నుంచి వస్తున్న వేధింపులతో కొంతకాలం ముంబైకి  పారిపోయి వచ్చాడు. కానీ సమస్య అలాగే ఉంది.

అతనో దినసరి కూలి. పక్కింట్లో ఉండే డిగ్రీ చదివిన అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఒకే కులం కావడంతో ఇరు కుటుంబాలకు పెద్దగా అభ్యంతరం లేదు. కానీ వరుసకు కూతురు అయ్యే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని ఇరువర్గాల కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆ ప్రేమజంట ఇటీవల సిరిసిల్ల ఠాణా మెట్లు ఎక్కింది. తాము పెళ్లి చేసుకుంటామని, ఇద్దరి తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలని కోరారు. ఇద్దరి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్‌ చేసినా పెళ్లికి అంగీకరించలేదు. 

అమ్మాయి వయసు 21. బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతుంది. అబ్బాయి వయసు 22.. కానీ ఇంటర్‌ ఫెయిల్‌. ఇద్దరూ ఇష్టపడ్డారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని నిర్ధారణకు వచ్చారు. ఒక రోజు కాలేజీకి వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెదికినా అమ్మాయి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఒక్క రోజు తర్వాత ఆ అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకున్న ఫొటోలు వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు అదృశ్యం కేసును పెండింగ్‌లో పెట్టారు. అమ్మాయి తల్లిదండ్రులు కన్నీరుపెడుతూ.. అవమానభారంతో ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. 

తంగళ్లపల్లి మండలానికి చెందిన ఓ అబ్బాయి, అదే ఊరికి చెందిన అమ్మాయి ఇద్దరూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తారు. ఇద్దరూ మేజర్లే. ఒకరినొకరు ఇష్టపడి సహజీవనం చేశారు. అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం చెప్పారు. కులం అడ్డుగోడగా నిలిచింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ అబ్బాయి పెళ్లికి నిరాకరించాడు. అమ్మాయి మాత్రం నిన్ను వదిలిపెట్టనంటూ పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తి ఇవ్వనంటూ అబ్బాయి తండ్రి స్పష్టం చేయడంతో తను సైతం తండ్రి వెంటనే వెళ్లిపోయాడు. అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు రోధిస్తూ ఇంటిదారి పట్టారు.

సిరిసిల్ల:  పెళ్లి అంటే.. అటు ఏడు తరాలు.. ఇటు తరాలు చూడాలంటారు పెద్దలు. కానీ నేటి యువత దీనికి భిన్నంగా ఆలోచిస్తుంది. మేము ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకుంటాం.. అంటూ వెళ్లిపోతున్నారు. ఇంటర్, డిగ్రీలు చదువుతున్న వయసులోనే ప్రేమ.. పెళ్లి అంటూ సంసార సాగరంలోకి వెళ్తున్న యువత తర్వాత కొద్ది రోజులకే విడిపోతున్నారు. జీవితంలో స్థిరపడకముందే తీసుకుంటున్న నిర్ణయాలతో రోడ్డున పడుతున్నారు. పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలతో పెద్దల గుండెలు పగిలిపోతున్నాయి. పిల్లలు చెబితే వినడం లేదని కన్నీరు పెడుతున్నారు. సిరిసిల్లలో ఓ తండ్రి తన కూతురు ప్రేమపెళ్లి చేసుకుని ఇల్లు విడిచిపోయిందనే ఆవేదనలో.. తన కూతురు చనిపోయిందంటూ ఫ్లెక్సీ పెట్టి దినకర్మ చేశాడు. తండ్రి హృదయం తల్లడిల్లిపోయి ఇలా ప్రవర్తించాడని సమాజం అండగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రుల నుంచి దీపావళి వరకు పల్లె, పట్నం పండుగ వాతావరణం ఉంటుంది. ఈ సమయంలోనే విద్యాసంస్థలకు వరుసగా సెలవులు రావడంతో యువతీ, యువకులు కలుసుకునేందుకు అవకాశం చిక్కుతుంది. ఇదే సమయంలో చూపులు కలిసి.. ప్రేమ చిగురించి.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. 

అపరిపక్వ నిర్ణయాలతో ఇబ్బంది
ప్రేమించి.. పెళ్లి చేసుకోవడం తప్పుకాకపోయినా అపరిపక్వత నిర్ణయాలతో జీవితంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సరైన వయసు.. సరైన ప్రణాళిక.. ఉపాధి మార్గాలు లేకుండా క్షణికావేశంలో పెళ్లికి సిద్ధపడుతుండడంతోనే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమాలు, సోషల్‌ మీడియా ప్రభావం యువతపై తీవ్రంగా ఉంది. కారణం ఏదైనా పిల్లల చేష్టలు పెద్దల మనసులను గాయపరుస్తున్నాయి. జీవితంలో స్థిరపడ్డాక, ఆర్థిక స్వావలంభన వచ్చిన తరువాత పెళ్లి చేసుకునే ప్రేమజంటలు జీవితంలో ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు.  

లక్ష్యం లేకపోవడమే సమస్య
యువతరం ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ దిశగా సాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ ఏ గోల్‌ లేకుండా సినిమాలు, సోషల్‌ మీడియా ప్రభావంతో మనసును గాడి తప్పిస్తే జీవితంలో ఇబ్బందులు పడతారు. తల్లిదండ్రులు.. పిల్లలతో చనువుగా ఉంటూ వారి ఇష్టాలను గౌరవిస్తూ భవిష్యత్‌పై మార్గనిర్ధేశనం చేయాలి. తల్లిదండ్రులుగా మంచిని బోధించే బాధ్యతలు తీసుకోవాలి.
– డాక్టర్‌ ప్రవీణ్, మానసిక వైద్యనిపుణులు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, సిరిసిల్ల

  కౌన్సెలింగ్‌ చేసి పంపిస్తున్నాం
మా ఠాణాకు ఇటీవల ప్రేమజంటలు ఎక్కువగా వస్తున్నాయి. మేజర్లమని చెబుతూ తల్లిదండ్రుల నుంచి రక్షణ కోరుతున్నారు. చట్టం పరిధిలో మేజర్లు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఏమి చేయలేం. కానీ వారి అమ్మానాన్నలకు, పెళ్లి చేసుకున్న జంటకు కౌన్సెలింగ్‌ చేస్తున్నాం. మైనరు అమ్మాయిలను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే కేసులు నమోదు చేస్తున్నాం. అమ్మాయిలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాం. జీవితంలో స్థిరపడ్డాక చేసుకునే ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల ఆమోదం కూడా లభిస్తుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికావు. 
– కె.కృష్ణ, సిరిసిల్ల టౌన్‌ సీఐ   

Videos

Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్

కరీంనగర్ లో దారుణం కూతురు కొడుకుపై తండ్రి దాడి..

Ranga Reddy: తమ్ముడు కులాంతర వివాహం అన్నను దారుణంగా చంపి

అనైతికత,అంకగణితం.. ఊడపొడిచింది ఏంటి..?

చిత్తూరు జిల్లా కుప్పం అమరావతి కాలనిలో దారుణం

దేశ పౌరుల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

జగన్ 2.0 ను తట్టుకోలేరు టీడీపీకి ఉష శ్రీ చరణ్ వార్నింగ్

చంద్రబాబు క్రెడిట్ చోర్ సాక్ష్యాలు లైవ్లో బయటపెట్టిన పేర్ని కిట్టు

మీ సిగ్గు లేని ప్రచారాలు ఆపండి! ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్

Eluru: గోవులను చంపే పశువధశాల భరించలేని వాసన

Photos

+5

సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)