Breaking News

మారుతి సుజుకి రీకాల్: 39వేల కార్లపై ఎఫెక్ట్!

Published on Sat, 11/15/2025 - 14:42

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్.. భారతదేశంలో విక్రయిస్తున్న గ్రాండ్ విటారాకు రీకాల్ జారీ చేసింది. ఇంతకీ కంపెనీ రీకాల్ ఎందుకు జారీ చేసింది, దీని ప్రభావం ఎన్ని కార్లపై పడింది? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.

'ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ సిస్టం'లలో ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి.. మారుతి సుజుకి తన గ్రాండ్ విటారాకు రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య వల్ల ఫ్యూయెల్ ట్యాంక్‌లో ఎంత ఇంధనం ఉందనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోలేరు. తద్వారా ఎక్కడైనా ఇంధనం పూర్తిగా అయిపోతే.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రభావం 2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారైన 39,506 కార్లపై ఉంటుంది.

గ్రాండ్ విటారా యజమానులు.. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అధీకృత మారుతి సుజుకి సర్వీస్ సెంటర్‌లను సందర్శించాలి. దీనికోసం వారు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇదీ చదవండి: పిల్లల కోసమే ఈ కారు: డ్రైవర్ అవసరం లేదు

మారుతి సుజుకి గ్రాండ్ విటారా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హైబ్రిడ్ కార్లలో ఒకటి. దీని ధరలు రూ. 10.77 లక్షల నుంచి రూ. 19.72 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికలో కూడా లభిస్తుంది.

Videos

మాజీ AVSO సతీశ్ కుమార్ మృతి కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్

YSRCP ఆఫీస్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్

హిందూపురం YSRCP ఆఫీస్ పై దాడి సాకే శైలజానాథ్ వార్నింగ్

Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి

ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ

Hindupur : YSRCP కార్యకర్తలపైనా దాడిచేసిన టీడీపీ నేతలు

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ కేసులో కీలక పరిణామం

ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?

బిహార్ ఫలితాలపై కేసీ వేణుగోపాల్ హాట్ కామెంట్స్

ఆస్ట్రేలియా YSRCP NRIలపై లక్ష్మీపార్వతి ప్రశంసలు

Photos

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)