ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఆదాయం రూ. 656 కోట్లు

Published on Sun, 11/09/2025 - 01:58

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం ఎంఈఐఎల్‌ గ్రూప్‌లో భాగమైన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 656.62 కోట్ల ఆదాయం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 523.70 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 25 శాతం అధికం. లాభం రూ. 47.65 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ. 49.43 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో 375 ఎలక్ట్రిక్‌ వాహనాలను డెలివర్‌ చేశామని, వీటిలో 25 ఎలక్ట్రిక్‌ టిప్పర్లు కూడా ఉన్నాయని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎండీ మహేష్‌ బాబు చెప్పారు. ఒక త్రైమాసికంలో ఇదే అత్యధికమని వివరించారు.

కంపెనీ ఇప్పటివరకు 3,254 వాహనాలను అందించింది. 9,818 వాహనాలకి ఆర్డర్లతో భవిష్యత్‌ వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నట్లు మహేశ్‌ బాబు చెప్పారు. నిర్వహణ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టడమనేది ఇటు ఆదాయం, లాభదాయకత వృద్ధికి దోహదపడినట్లు తెలిపారు. అటు దేశీయంగా ఎలక్ట్రిక్‌ బస్‌ సెగ్మెంట్లో తొలిసారిగా తమ బ్లేడ్‌ బ్యాటరీ ప్యాక్‌కి సరి్టఫికేషన్‌ లభించినట్లు వివరించారు. వచ్చే త్రైమాసికం నుంచి ఈ టెక్నాలజీతో బస్సుల తయారీ ప్రారంభమవుతుందని మహేశ్‌ బాబు తెలిపారు. అర్థ సంవత్సరానికి గాను కంపెనీ ఆదాయం రూ. 837.61 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ. 1,003.85 కోట్లకు చేరింది. లాభం రూ. 71.91 కోట్ల నుంచి 5 శాతం పెరిగి రూ. 75.46 కోట్లకు చేరింది.   
 

Videos

సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!

పశువులను చంపి.. పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం

జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

న్యాయం అడిగితే కేసులు పెడతారా ? అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు

ఏపీలో ఫ్రీ బస్సు పథకానికి మంగళం?

ఇదీ నా కాలే.. అదీ నా కాలే.. లైవ్ లో ఇచ్చిపడేసిన RGV

జల్సా టైటిల్ కరెక్ట్ గా సరిపోద్ది.. అధికారం ఏపీలో కానీ..

ప్రభుత్వ వైద్యానికి చంద్రగ్రహణం

చేపల వర్షం..ఇదేందయ్యా, ఇది!

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

Photos

+5

చీరలో కిక్‌ ఇచ్చే ఫోజులతో బిగ్‌బాస్‌ 'అశ్విని శ్రీ ' (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్‌ షో అదరహో (ఫొటోలు)

+5

అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్‌ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)

+5

'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)

+5

వీకెండ్‌ స్పెషల్‌.. హైదరాబాద్‌ సమీపంలోని బెస్ట్‌ పిక్నిక్ స్పాట్‌లు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టీమిండియా టీ20 మ్యాచ్‌లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)

+5

ముద్దమందారం అంతా క్యూట్‌గా బ్రిగిడ (ఫొటోలు)