Breaking News

సేవింగ్స్ అకౌంట్‌ ఉంటే రూ.7,500 క్యాష్‌బ్యాక్!!

Published on Sat, 11/08/2025 - 17:44

రోజువారీ ఖర్చుల కోసం మీరు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంటే, ఈ ఆఫర్ మీకోసమే! ప్రైవేట్ రంగానికి చెందిన డీసీబీ బ్యాంక్ (DCB Bank) తన హ్యాపీ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. హ్యాపీ సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై కస్టమర్లు నెలకు రూ .625 వరకు, సంవత్సరానికి రూ .7,500 వరకు సంపాదించవచ్చు.

క్యాష్ బ్యాక్ ఎలా పొందాలంటే..

ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవడానికి, మీరు డీసీబీ బ్యాంక్లో హ్యాపీ సేవింగ్స్ ఖాతాను తెరవాలి. తరువాత ఖాతాలోని మొత్తాన్ని ఉపయోగించి యూపీఐ ద్వారా (డెబిట్ లావాదేవీలు) చేసే చెల్లింపులపై బ్యాంకు ప్రతి త్రైమాసికం లేదా మూడు నెలలకోసారి క్యాష్ బ్యాక్ను మీ ఖాతాలో జమచేస్తుంది.

నిబంధనలు, ప్రయోజనాలు

ఖాతాలో కనీసం రూ.10,000 సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) నిర్వహించడం తప్పనిసరి.

క్యాష్ బ్యాక్ కు అర్హత సాధించడానికి, సగటు త్రైమాసిక బ్యాలెన్స్ (AQB) రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

కనీస లావాదేవీ మొత్తం రూ. 500.

ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌, ఐఎంపీఎస్లావాదేవీలు ఉచితం.

డీసీబీ బ్యాంక్ ఏటీఎం నుంచి అపరిమిత ఉచిత లావాదేవీలు

యూపీఐ అంటే..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)అనేది ఒక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దీంతె మీ మొబైల్ ఫోన్ ద్వారా రోజులో 24 గంటలు, వారానికి 7 రోజులు తక్షణం డబ్బును పంపడం లేదా స్వీకరించడం సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. యూపీఐ ద్వారా మీ బ్యాంకు ఖాతాను గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్‌ వంటి యాప్‌లతో అనుసంధానం చేయవచ్చు.

Videos

కళ్ళ ముందే కుప్పకూలిన రష్యన్ ఆర్మీ హెలికాప్టర్

భక్తురాలి అత్యుత్సాహం.. హుండీలో డబ్బులన్నీ బూడిద

నేను అండగా ఉంటా బాధపడొద్దు.. కార్యకర్తల కుటుంబాలకు కొడాలి నాని భరోసా

బాహుబలి ఎపిక్ రికార్డ్స్ పై కన్నేసిన పుష్ప ఎపిక్

రామచంద్రాపురంలో బాలిక కేసులో వీడిన మిస్టరీ

కూకట్ పల్లిలో YSRCP నేతల కోటిసంతకాల సేకరణ

ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి

నారా లోకేష్ పై గోరంట్ల మాధవ్ ఫైర్

షూ చూశారా.. నన్ను టచ్ చేస్తే.. ఒక్కొక్కడికీ..

రైతును రాజు చేసింది YSR.. అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలో

Photos

+5

'కాంతార 1' టీమ్ గెట్ టూ గెదర్.. అలానే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అనసూయ కొడుకు పుట్టినరోజు.. ఆఫ్రికన్ దేశంలో సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 09-16)

+5

తిరుమలలో రిలయన్స్ అధినేత: శ్రీవారిని దర్శించుకున్న అంబానీ (ఫోటోలు)

+5

చీరలో కిక్‌ ఇచ్చే ఫోజులతో బిగ్‌బాస్‌ 'అశ్విని శ్రీ ' (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్‌ షో అదరహో (ఫొటోలు)

+5

అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్‌ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)

+5

'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)