రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా?
Breaking News
ఇళ్ల ధరలకు రెక్కలు!
Published on Fri, 11/07/2025 - 04:17
న్యూఢిల్లీ: బలమైన డిమాండ్ నేపథ్యంలో ఇళ్ల ధరలు వచ్చే రెండు దశాబ్దాలపాటు ఏటా 5–10 శాతం మేర పెరుగుతాయని సీఐఐ, కొలియర్స్ ఇండియా సంయక్త నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం వార్షికంగా ఇళ్ల అమ్మకాలు 3–4 లక్షల యూనిట్ల స్థాయిలో ఉండగా, 2047 నాటికి 10 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరతాయని పేర్కొంది. అంటే 2047 నాటికి రెట్టింపు కానున్నట్టు అంచనా వేసింది. పరిశ్రమల మండలి సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా తమ నివేదికను తాజాగా విడుదల చేశాయి.
పెరుగుతున్న ఆదాయం, ఇళ్లకు సంబంధించి సానుకూల విధానాలు, పట్టణాలకు వలసలు, ప్రీమియం ఇళ్ల పట్ల ఆసక్తిని పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచి్చస్తుండడం, కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలను సైతం ప్రస్తావించింది. ఇప్పటికే పేరొందిన ముఖ్య నివాస మార్కెట్లకు అదనంగా, టైర్ 2, 3 పట్టణాలు, ఆధ్యాతి్మక కేంద్రాల్లో ఇళ్లకు వచ్చే దశాబ్ద కాలం పాటు డిమాండ్ స్థిరంగా పెరుగుతుందని అంచనా వేసింది.
10 ట్రిలియన్ డాలర్లు..
దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం ప్రస్తుతం 0.3 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, 2047 నాటికి 5–10 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని సీఐఐ, కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. ‘‘మౌలిక వసతుల విస్తరణ రియల్ ఎసేŠట్ట్ మార్కెట్ రూపురేఖలను మార్చేయనుంది. కొత్త మార్కెట్ల వృద్ధికి అవకాశాలు కలి్పంచనుంది. టైర్–2, 3 పట్టణాలనూ మార్చనుంది. బహుళ ట్రిలియన్ డాలర్ల రియల్ ఎసేŠట్ట్ మార్కెట్ దిశగా అడుగులు వేస్తున్నాం.
ప్రపంచస్థాయి నిర్మాణాలు, సమగ్ర రవాణా కేంద్రాలు, బలమైన రవాణా పరిష్కారాలు ఇవన్నీ మరింత ప్రముఖంగా మారనున్నాయి’’అని ఈ నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర రవాణా, రహదారుల శాఖ డిప్యూటీ సెక్రటరీ హర్లీన్ కౌర్ పేర్కొన్నారు. మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్ రంగం ఒకదానికి మరొకటి ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘‘ఎక్స్‌ప్రెస్ రహదారులు, పారిశ్రామిక కారిడార్ల అనుసంధానతను పెంచుతాయి. పట్టణాభివృద్దికి దారితీస్తాయి’’అని చెప్పారు. స్థిరమైన వృద్ధికి వీలుగా రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా రంగాల్లో టెక్నాలజీ అనుసరణను పెంచాలని సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు.
Tags : 1