Breaking News

నాన్నలూ అమ్మలవుతారు... కుంగిపోతారు

Published on Fri, 11/07/2025 - 00:34

బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తల్లికి డిప్రెషన్‌ రావడం సహజం. దాన్నే పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ అంటారు. అయితే తల్లులతోపాటు తండ్రులూ ఆ డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్నారని నిపుణులు అంటున్నారు.  మైక్రో ఫ్యామిలీగా ఉండటం వల్ల పెంపకం బాధ్యత ఒత్తిడి కారణంగా డిప్రెషన్, యాంగ్జయిటీ ఎదుర్కొంటున్న తండ్రుల గురించి పట్టించుకోవాల్సి ఉంది.

కుంగిపోతారు
‘ఒక బిడ్డను పెంచడానికి ఓ ఊరంతా కావాలని’ సామెత. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో బిడ్డల పెంపకానికి  వెసులుబాటు ఉండేది. బాధ్యతను అందరూ పంచుకొని బిడ్డను కంటికి రెప్పలా కాపాడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. బిడ్డల పెంపకమంతా తల్లిదండ్రుల మీదే పడింది. ఈ కారణం వల్ల కొంత, భౌతిక–మానసిక మార్పుల వల్ల కొంత బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తల్లి కుంగుబాటుకు గురవడం చాలామందికి తెలిసిందే! దాన్నే పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ అంటారు. అయితే తల్లులతోపాటు తండ్రులూ ఆ డిప్రెషన్ ను ఎదుర్కొంటున్నారని వైద్యనిపుణులు అంటున్నారు.

అసలేంటీ పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌?
స్త్రీ జీవితంలో మాతృత్వం మధురమైన అనుభవం. ఆ సమయంలో ఆమెలో అనేక శారీరక, మానసిక మార్పులు ఏర్పడతాయి. దాంతో ఒత్తిడి, చిరాకు, యాంక్సైటీ, కోపం, కుంగుబాటు ఆమెను చుట్టుముడతాయి. బిడ్డను రోజంతా చూసుకోవాల్సి రావడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒకేచోట గంటల తరబడి ఉండిపోవడం వల్ల పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్ కి గురవుతారు. ఇది కొందరితో గర్భధారణ సమయం నుంచే మొదలవుతుందని వైద్యులు అంటున్నారు. ఇన్నాళ్లూ ఈ సమస్య అమ్మలకే వస్తుందనే ఆలోచన ఉండగా, ప్రస్తుతం నాన్నలు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తేలింది.

నాన్నల్ని అర్థం చేసుకునేదెవరు?
ప్రస్తుతం చాలామంది 27 దాటాక పెళ్లిళ్లు చేసుకొని 30 ఏళ్లకు తండ్రవుతున్నారు. అటు ఉద్యోగం, ఇటు కెరీర్, ఈఎంఐలు, బాధ్యతలు, ఖర్చులు, అవసరాలతో సతమతమైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బిడ్డ పుట్టిన ఆనందం ఉన్నా, మెల్లగా ఆ ఆనందం స్థానంలో కొత్తగా రాబోయే ఖర్చులు, బాధ్యతలు వారిని భయపెడుతున్నాయి. బిడ్డ పుట్టాక రాత్రుళ్లు నిద్ర సరిగ్గా లేకపోవడం, భార్యాబిడ్డల్ని చూసుకోవాల్సి రావడం వంటి కారణాలతో మగవారు సైతం పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్ కు గురవుతన్నారు. ఉన్నట్టుండి కోపం రావడం, చిన్న విషయాలకు చిరాకు పడటం, అరవడం, ఇంటికి దూరంగా ఉండాలనుకోవడం వంటివి ఈ డిప్రెషన్  తాలూకు లక్షణాలు. తలనొప్పి, వాంతులు, అజీర్తి, కీళ్ల నొప్పులు సైతం వీరిని వేధిస్తాయి.

మగవారికి అందాల్సిన చేయూత 
బిడ్డ పుట్టిన తర్వాత చాలామంది తల్లి ఆరోగ్యంపైనే దృష్టి నిలుపుతారు. ఆమెను జాగ్రత్త చూసుకోవాలని భావిస్తుంటారు. తండ్రి పరిస్థితి ఏమిటి... అతను పడుతున్న ఇబ్బందులేమిటన్న విషయాన్ని చాలామంది పరిగణనలోకి తీసుకోరు. మగవారు కూడా తమ సమస్యల్ని బయటకు చెప్పుకునేందుకు మొహమాట పడతారు. లోలోపలే దాచుకొని సతమతమవుతారు. దీంతో వారి సమస్య మరింత పెరిగి ఒక్కోసారి ఆత్మహత్యా ప్రేరేపిత ఆలోచనల వరకూ వెళ్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో తల్లితోపాటు తండ్రికీ కుటుంబ సభ్యుల చేయూత అవసరమని, వారితో మాట్లాడుతూ, వారి సమస్యల్ని విని ఓదార్పు అందించాలని అంటున్నారు. అవసరమైతే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ అందించాలంటున్నారు.  

Videos

Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు

విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు

Tirupati: అంధకారంలో గ్రామాలు వరదలో కొట్టుకుపోయిన పశువులు

జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే

KSR Live Show: క్రెడిట్ దొంగ

చంద్రబాబు గుండెల్లో బుల్లెట్ ట్రైన్లు కరకట్టపై యాంకర్ ఈశ్వర్ సంచలన నిజాలు

బీహార్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్... ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్

KGH: విద్యుత్ సరఫరా నిలిచిపోయి పనిచేయని వైద్య పరికరాలు

భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలప డానికి సిద్ధం

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా?

Photos

+5

చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)

+5

'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్‌ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

కాంత ట్రైలర్‌ లాంచ్‌.. ఒకే వేదికపై దుల్కర్‌, రానా (ఫోటోలు)

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)