Breaking News

టీసీఎస్‌ షాకింగ్‌ శాలరీ.. నెలకు రూ.422 పెరిగితే..

Published on Thu, 11/06/2025 - 17:52

ఒక టీసీఎస్ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాలుగేళ్లకు పైగా పనిచేసిన తనకు ఈ సంవత్సరం నెలకు కేవలం రూ.422 ఇంక్రిమెంట్ మాత్రమే వచ్చిందని అతను పేర్కొన్నారు. “టీసీఎస్ నాకు 4 సంవత్సరాల తర్వాత రూ.422 పెంపు ఇచ్చింది..” అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు.

2021లో కంపెనీలో చేరినట్లు పేర్కొన్న రెడిటర్‌ .. “ఇది నా చెడు నిర్ణయాల ఫలితం” అని పేర్కొంటూ, తాను సపోర్ట్ప్రాజెక్ట్‌లో పనిచేశానని, అక్కడ “జీరో లెర్నింగ్, జీరో గ్రోత్, అంతులేని అరుపులు, మైక్రోమేనేజ్మెంట్” ఉండేదని రాసుకొచ్చారు. తన పెంపు ఆరు నెలల ఆలస్యంగా వచ్చిందని, ఈ పరిస్థితుల్లో టీసీఎస్ వంటి సంస్థలు “పల్లీలు కొనుక్కునే చెల్లింపులు” ఇస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన “మీ విలువ తెలుసుకోండి” అని టీసీఎస్ ఉద్యోగులు, ఫ్రెషర్లకు సూచించారు.

వైరల్గా మారిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విస్తృతంగా స్పందించారు.ఇంక్రిమెంట్ దారుణంగా ఇవ్వడంతో నేను 7 సంవత్సరాల తర్వాత టీసీఎస్ వీడాను అంటూ యూజర్కామెంట్చేశారు. ఈ సంవత్సరం తనకు జీరో హైక్ వచ్చిందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “ఐటీని విడిచిపెట్టడం ఉత్తమ మార్” అంటూ మరొకరు కామెంట్చేశారు.

ఇక టీసీఎస్ కూడా ఈ ఘటనపై స్పందించింది. “వ్యక్తిగత కేసులపై మేం వ్యాఖ్యానించం. కానీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నవి అవాస్తవాలు” అని టీసీఎస్ప్రతినిధి పేర్కొన్నారు. “సెప్టెంబర్ 1 నుంచి మా ఉద్యోగుల 80% మందికి వేతన సవరణలు అమలయ్యాయి. సగటు ఇంక్రిమెంట్ 4.5% నుంచి 7% మధ్య ఉంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల పెంపు ఇచ్చాం” అని తెలిపారు

Videos

Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు

విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు

Tirupati: అంధకారంలో గ్రామాలు వరదలో కొట్టుకుపోయిన పశువులు

జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే

KSR Live Show: క్రెడిట్ దొంగ

చంద్రబాబు గుండెల్లో బుల్లెట్ ట్రైన్లు కరకట్టపై యాంకర్ ఈశ్వర్ సంచలన నిజాలు

బీహార్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్... ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్

KGH: విద్యుత్ సరఫరా నిలిచిపోయి పనిచేయని వైద్య పరికరాలు

భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలప డానికి సిద్ధం

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా?

Photos

+5

చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)

+5

'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్‌ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

కాంత ట్రైలర్‌ లాంచ్‌.. ఒకే వేదికపై దుల్కర్‌, రానా (ఫోటోలు)

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)