‘స్టెమ్‌’లో జెమ్‌ అయ్యేలా...

Published on Tue, 10/28/2025 - 00:47

చాలామంది పిల్లలు ‘అనగనగా ఒక రాజు’ లాంటి కథలు చెబితే ఆసక్తిగా వింటారు. సైన్స్, మ్యాథ్స్‌ విషయాలు చెప్పబోతే మాత్రం ముఖం అటువైపు తిప్పుకుంటారు.
అలాంటి వారి కోసం ‘స్టెమ్‌ మాన్‌స్టర్‌’ను ప్రారంభించింది డా. సోనాలి దాస్‌ గుప్తా. కథలు ఎలాగైతే ఆసక్తిగా వింటారో అంతే ఆసక్తితో సైన్స్‌  పాఠాలు వినేలా ‘స్టెమ్‌ మాన్‌స్టర్‌’ను డిజైన్‌ చేసింది సోనాలి. 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, దిల్లీలో భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన సోనాలి స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం)కు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలు పిల్లలకు సులభంగా అర్థం చేయించడానికి ‘స్టెమ్‌ మాన్‌స్టర్‌’ మొదలుపెట్టింది. సైన్స్‌ సిద్ధాంతాలను వివరించడానికి ఎన్నో పరికరాలు, బొమ్మలు తయారు చేసింది. జటిలమైన సైన్స్‌ విషయాలను అర్థం చేసుకోవడంలో ఇవి విద్యార్థులకు బాగా ఉపయోగపడుతున్నాయి.

‘మన  పాఠశాలలు సైన్స్‌కు సంబంధించి నిర్వచనాలకే పరిమితం అవుతున్నాయి. నేను ప్రపంచంలోని కొన్ని అత్యున్నత ప్రయోగశాలలలో పనిచేశాను. సైన్స్‌కు సంబంధించి జటిలమైన విషయాలను పిల్లలకు సులభంగా ఎలా వివరిస్తారో చూశాను. మన  పాఠ్యాంశాలు అత్యున్నతమైనవిగా నేను భావిస్తున్నాను. కాని వాటిని మనం పిల్లలకు పరిచయం చేసే విధానంలో సమగ్ర మార్పు అవసరం. ఆ మార్పు కోసమే...స్టెమ్‌ మాన్‌స్టర్‌’ అంటుంది సోనాలిదాస్‌ గుప్తా. ‘స్టెమ్‌మాన్‌స్టర్‌’ కోర్సులను జూమ్, ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
 

Videos

శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం

వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా

ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్

తీరం దాటినా తగ్గని ప్రభావం.. మరో 48గంటలపాటు..

ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు.. విజయవాడలో మహిళ ఆవేదన

సీఎం, డీసీఎం లేకపోయినా అధికారుల పనితీరుకు హ్యాట్సాఫ్

మోంథా ముప్పు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Viral Video: దటీజ్ కోబ్రా.. దాని పౌరుషం చూస్తే.. గుండె గుభేల్

కూలిన భారీ వృక్షాలు.. మునిగిన రోడ్లు, పంట పొలాలు

Photos

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)

+5

నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్‌లీ ఫొటోలు