శివసేన నేతతో నటి ఎంగేజ్‌మెంట్‌ : ఫోటోలు వైరల్‌

Published on Mon, 10/27/2025 - 15:38

ఇటీవలి కాలంలో సెలబ్రిటీల వెడ్డింగ్‌ బెల్స్‌ జోరుగా మోగుతున్నాయి.  రానున్న వెడ్డింగ్‌ సీజన్‌కు తగ్గట్టుగా అందరూ మూడుముళ్ల వేడుకకు  రెడి అవుతున్నారు. తాజాగా  మరాఠీ నటి తేజస్విని లోనారి ,  శివసేన  నేత సమాధన్ సరవంకర్  నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని  వారు స్వయంగా సోషల్‌మీడియాలో పంచుకోవడంతో నెట్టింట సందడి నెలకొంది.

శివసేన పార్టీ యువతనేత సమాధన్ సరవంకర్  సీనియర్‌ నేత సదా సర్వాంకర్‌ పెద్ద కుమారుడు.  తేజస్విని లోనారి -సమాధన్ సరవంకర్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబం సభ్యులు, సన్నిహితుల సమక్షంలో  సోమవారం  జరిగింది.  దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. అటు పార్టీ అభిమానులు, ఇటు  ఫ్యాన్స్‌  జంటకు శుభాకాంక్షలు తెలిపారు.  చక్కటి జంట అంటూ వీరికి అభినందనలు వెల్లువెత్తాయి.


తేజస్విని  ఎంబ్రాయిడరీ ,జరీ వర్క్‌తో   కలగలిసిన అందమైన ఎరుపు సాంప్రదాయ చీరలో అందంగా మెరిసింది. దీనికి తగ్గట్టు ఆభరణాలు, చేతినిండా గోరింటాకుతో పెళ​కళతో ఉట్టిపడేలా కనిపించింది.  అటు ఎంబ్రాయిడరీ , సీక్విన్ వర్క్‌తో  తయారు చేసిన  వైట్‌ షార్ట్‌ షేర్వానీలో సమాధన్ శరవంకర్ అందంగా కనిపించాడు.

మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి  తేజస్విని. అనేక టీవీ మరాఠీ సీరియల్స్‌లో  నటించి తనదైన ముద్ర వేసింది. మరోవైపు, సమాధాన్ సారవంకర్ శివసేనకు చెందిన చురుకైన యువ నాయకుడు. ముంబై రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.   సమధాన్‌ తండ్రిసదా శరవంకర్ మహీం నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం షిండే గ్రూపురాజకీయాల్లో చురుకుగా  ఉన్నారు.

 


 

Videos

శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం

వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా

ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్

తీరం దాటినా తగ్గని ప్రభావం.. మరో 48గంటలపాటు..

ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు.. విజయవాడలో మహిళ ఆవేదన

సీఎం, డీసీఎం లేకపోయినా అధికారుల పనితీరుకు హ్యాట్సాఫ్

మోంథా ముప్పు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Viral Video: దటీజ్ కోబ్రా.. దాని పౌరుషం చూస్తే.. గుండె గుభేల్

కూలిన భారీ వృక్షాలు.. మునిగిన రోడ్లు, పంట పొలాలు

Photos

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)

+5

నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్‌లీ ఫొటోలు