జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు
Breaking News
తగ్గిన ఆహార ధరలు
Published on Wed, 10/15/2025 - 00:19
న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల ధరలు, తయారీ వస్తువుల ధరలు శాంతించడంతో టోకు ద్రవ్యోల్బణం సెప్టెంబర్ మాసంలో 0.13 శాతానికి పరిమితమైంది. టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూటీఐ) ఈ ఏడాది ఆగస్ట్‌లో 0.52 శాతంగా ఉంటే, గతేడాది సెప్టెంబర్‌లో 1.91 శాతంగా ఉండడం గమనార్హం.
⇒ ఆహార వస్తువుల్లో మైనస్ 5.22 శాతం ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదైంది. ఆగస్ట్‌లో ఇది 3.06 శాతంగా ఉంది.
⇒ ముఖ్యంగా కూరగాయల ధరలు తగ్గాయి. ఈ విభాగంలో మైనస్ 24.41 శాతం ప్రతికూల ద్రవ్యోల్బణం నెలకొంది. ఆగస్ట్‌లో ఇది 14.18 శాతంగా ఉంది.
⇒ తయారీ వస్తువుల విభాగంలో 2.33 శాతానికి ద్రవ్యోల్బణం శాంతించింది. ఆగస్ట్‌లో ఇది 2.55 శాతంగా ఉంది.
⇒ ఇంధనం, విద్యుత్ విభాగంలోనూ మైనస్ 2.58 శాతం ద్రవ్యోల్బణం నెలకొంది. ఆగస్ట్‌లో ఇది 3.17 శాతంగా ఉంది.
కనిష్ట స్థాయిలోనే కొంత కాలం
అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు గణనీయంగా తగ్గడంతో, టోకు ద్రవ్యోల్బణం దీర్ఘకాలం పాటు కనిష్ట స్థాయిల్లోనే కొనసాగొచ్చని బార్క్‌లేస్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ఆస్తా గుడ్వాణీ అభిప్రాయపడ్డారు.
Tags : 1