Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్ మర్డర్
Breaking News
ఈ స్కూటర్ల ఓనర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన కంపెనీ
Published on Thu, 09/18/2025 - 18:05
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ తమ కస్టమర్లకు మంచి కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా 500 ఎక్స్ పీరియన్స్ సెంటర్ (ఈసీ)లను అధిగమించింది. ఇది దాని రిటైల్ విస్తరణలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. గత మూడు నెలల్లో (జూన్-ఆగస్టు 2025), ఏథర్ 101 కొత్త ఈసీలను జోడించింది.
"మా వృద్ధి భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ మొబిలిటీకి పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది" అని ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ సింగ్ ఫోకెలా అన్నారు. "దక్షిణ భారతదేశం మా కంచుకోటగా నిలిచినప్పటికీ, రిజ్తా విజయం టైర్-2, 3 నగరాల్లో మా విస్తరణను వేగవంతం చేసింది" అన్నారు.
ఆగ్రా, జబల్పూర్, బిలాస్పూర్, వడోదర, సుందర్గఢ్ వంటి నగరాల్లో ఏథెర్ ఇప్పుడు ఈసీలను కలిగి ఉంది. అలాగే కాలికట్, గుంటూరు, హల్ద్వానీ, కోటా వంటి పట్టణాల్లోకి చొచ్చుకుపోయింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఒక్కో చోట 50కి పైగా ఈసీలు ఉన్నాయి. బెంగళూరులో ఏకంగా 18 కేంద్రాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఏథర్ మార్కెట్ వాటా 2026 తొలి త్రైమాసికంలో 14.3 శాతానికి పెరిగింది. గత సంవత్సరం ఇది 7.6% ఉండగా రెట్టింపు అయింది. మధ్య భారతదేశంలో వాటా 10.7 శాతానికి పెరిగగా, దక్షిణ భారతదేశంలో 22.8 శాతంతో ఆధిపత్యాన్ని చాటింది.
ఏథర్ పోర్ట్ ఫోలియోలో పనితీరు-ఆధారిత 450 సిరీస్, ఫ్యామిలీ-ఫోకస్డ్ రిజ్టా ఉన్నాయి. అథెర్ కమ్యూనిటీ డే 2025లో ఇది తన నెక్స్ట్-జెన్ ఈఎల్ ప్లాట్ ఫామ్, ఏథర్ స్టాక్ 7.0, ఇన్ఫినిట్ క్రూయిజ్, పోథోల్ అలర్ట్స్ వంటి కొత్త ఫీచర్లను ఆవిష్కరించింది.
తమిళనాడులోని హోసూర్ లో ఏథర్ రెండు ప్లాంట్ లను నిర్వహిస్తోంది. మహారాష్ట్రలోని బిడ్కిన్ లో మూడవ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది మొత్తం సామర్థ్యాన్ని సంవత్సరానికి 1.42 మిలియన్ యూనిట్లకు పెంచుతుంది. భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఈసీలను 700లకు పైగా పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Tags : 1