Breaking News

జాన్ అలుకాస్ కార్ల కలెక్షన్‌లో ఈ కొత్త కార్‌ హైలైట్‌..

Published on Wed, 09/17/2025 - 22:25

చాలా మందికి కారును సొంతం చేసుకోవడం అంతిమ కల. కానీ జాన్ అలుకాస్‌కు అలా కాదు.. బెస్ట్‌ కార్‌ తన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. కేరళకు చెందిన బిలియనీర్, ప్రఖ్యాత జ్యువెలరీ రిటైల్ గ్రూప్ జోస్ అలుక్కాస్ సీఈవో తన లగ్జరీ కార్ల కలెక్షన్‌లో భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ఎంజీ సైబర్‌స్టర్‌ను జోడించారు.

అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్‌

ఎంజీ సైబర్‌స్టర్ ఒక సాధారణ స్పోర్ట్స్ కారు కాదు. ఇది క్లాసిక్ డిజైన్ , మోడరన్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) టెక్నాలజీల అద్భుతమైన కలయిక. ఇది అలుక్కాస్ వంటి ఆటోమొబైల్ ఔత్సాహికులకు సరిగ్గా సరిపోతుంది.

ఈ కారు 510 హార్స్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ తో ప్యాక్ అయింది. సైబర్‌స్టర్ కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్ స్టర్లలో ఒకటిగా నిలిచింది.

బటర్‌ఫ్లై డోర్లు, సొగసైన కన్వర్టిబుల్ రూఫ్‌, 20-అంగుళాల చక్రాలతో దీని ఫ్యూచరిస్టిక్ లుక్ అబ్బురపరుస్తుంది. 77 కిలోవాట్ బ్యాటరీతో కార్580 కిలోమీటర్ల రేంజ్ను (వాస్తవ ప్రపంచ పరిస్థితులలో సుమారు 400 కిమీ) ఇస్తుంది. దీని ధరలు రూ.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. సైబర్ స్టర్ ఇప్పటికే ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తరంగాలను సృష్టిస్తోంది.

ఆటోమొబైల్స్ పట్ల జాన్ అలుకాస్కు ఉండే ఇష్టం రహస్యమేమీ కాదు. లగ్జరీ కార్లలో అసాధారణమైన అభిరుచికి ఆయన చాలా కాలంగా ప్రసిద్ది చెందారు. ఆయన ఆకట్టుకునే కార్ల కలెక్షన్లో ఇప్పటికే లంబోర్ఘిని హురాకాన్, రోజువారీ డ్రైవ్ ల కోసం పోర్స్చే 911, మహీంద్రా థార్ 3-డోర్, మహీంద్రా బీఈ6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఉన్నాయి. ఇప్పుడు ఎంజీ సైబర్ స్టర్ చేరింది.

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే