YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల
Breaking News
బంగారం @ 1,13,800
Published on Sat, 09/13/2025 - 01:45
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. శుక్రవారం ఈ విలువైన లోహాలు సరికొత్త జీవిత కాల గరిష్టాలకు చేరాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు రూ.700 పెరగడంతో రూ.1,13,800 స్థాయిని నమోదు చేసింది. వెండి కిలోకి ఏకంగా రూ.4,000 పెరిగి 1,32,000ను తాకింది. అంతర్జాతీయంగా బలమైన డిమాండ్ ధరలకు మద్దతుగా నిలిచినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘‘ఇటీవలి యూస్ ఆర్థిక డేటాతో ఫెడ్ 2025లోనే ఒకటికి మించిన విడతల్లో రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలు పెరిగాయి.
దీంతో బంగారంలో కొనుగోళ్లు పెరిగాయి’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. పారిశ్రామిక డిమాండ్‌కు తోడు ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి బలమైన పెట్టుబడుల ప్రవాహంతో వెండి ధరలు పెరిగినట్టు చెప్పారు. ఈ ఏడాది పెట్టుబడిదారులకు బంగారం, వెండి మంచి లాభాన్నిచ్చాయి. ఇప్పటి వరకు బంగారం ధర 10 గ్రాములకు రూ.34,850 (44 శాతం), వెండి ధర కిలోకి రూ.42,300 (47 శాతం) చొప్పున పెరగడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం స్వల్ప లాభంతో 3,683 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.
Tags : 1