Breaking News

ఈయూతో ఒప్పందం.. ఆ రంగానికి అవకాశాలు

Published on Fri, 09/12/2025 - 21:12

ఐరోపా సమాఖ్య (ఈయూ)తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు పెద్ద ఎత్తున అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ స్పెషల్‌ సెక్రటరీ రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఎగుమతులను పెంచుకోవచ్చని, 27 దేశాల కూటమికి చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజాలతో కొత్త భాగస్వామ్యాలకు అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

భారత ప్రజలకు సరైన టెక్నాలజీ, సరైన రవాణా పరిష్కారాలను తీసుకొచ్చేందుకు వీలుంటుందన్నారు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయంటూ.. ఆటోమొబైల్‌ రంగానికి ఇది ఎంతో ముఖ్యమన్నారు. ఈయూలో మార్కెట్‌ అవకాశాలపై అవగాహన కుదిరిన వెంటనే చర్చలను త్వరగా ముగిస్తామని చెప్పారు.

ఈయూ అధికారుల బృందం ఢిల్లీలో 13వ విడత చర్చలు నిర్వహించిన నేపథ్యంలో అగర్వాల్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించి సుంకాల్లో రాయితీలు ఇవ్వాలని ఈయూ బృందం డిమాండ్‌ చేస్తుండడం గమనార్హం. ఈ ఏడాది మే 6న బ్రిటన్‌తో కుదిరిన ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో ఆ దేశ ఆటోమొబైల్‌ కంపెనీలకు భారత్‌ రాయితీలను కల్పించడం తెలిసిందే. దీంతో ఈయూ సైతం ఇదే విధమైన డిమాండ్‌ చేస్తోంది.

బ్రిటన్‌తో ఒప్పందం వల్ల ఆటోమొబైల్‌ దిగుమతులపై టారిఫ్‌లు 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గుతాయని అగర్వాల్‌ చెప్పారు. అది కూడా 10–15 ఏళ్ల కాలంలో క్రమంగా అమలవుతుందన్నారు. సున్నిత రంగాల ప్రయోజనాలను కాపాడేందుకు యూకేతో ఒప్పందంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. భారత ఆటోమొబైల్‌ రంగం ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా క్రమంగా భారత్‌ మార్కెట్‌ అవకాశాలకు తలుపుల తెరిచే నిబంధనలు పెడుతున్నట్టు వివరించారు. 

Videos

మంత్రి నారాయణకు బిగ్ షాక్ డయేరియా బాధితుల ఫ్యామిలీ నిలదీత

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

'మిరాయ్’ మూవీ రివ్యూ

చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే

Haryana: కానిస్టేబుల్ ను గంట జైల్లో పెట్టిన కోర్టు

Photos

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)