Breaking News

బీఎఫ్‌ఎస్‌ఐలో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు 

Published on Sat, 08/23/2025 - 06:10

ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా  (బీఎఫ్‌ఎస్‌ఐ) సేవలకు డిమాండ్‌ బలంగా పెరుగుతోంది. దీంతో ఈ రంగంలోని కంపెనీలు మెట్రోలకే పరిమితం కాకుండా టైర్‌ 2, 3 పట్టణాల్లోనూ (ద్వితీయ, తృతీయ శ్రేణి) తమ సేవలను విస్తరిస్తున్నట్టు మానవ వనరుల సేవలు అందించే అడెకో ఇండియా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.7% మేర ఈ రంగం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2030 నాటికి ఈ రంగంలో 2.5 లక్షల కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. 

ఈ రంగంలో కొత్త ఉద్యోగాల్లో 48% టైర్‌ 2, 3 పట్టణాల్లోనే ఉంటున్నట్టు వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నియామకాలు 27 శాతం పెరిగినట్టు తెలిపింది. స్థానిక భాషపై పట్టు, అమ్మకాల్లో అనుభవం కలిగిన వారు ఇతరులతో పోల్చితే 2.5 రెట్లు అధికంగా ఎంపికయ్యే అవకాశాలు కలిగి ఉన్నట్టు.. 10–15% అధిక వేత నం వీరికి లభిస్తున్నట్టు వెల్లడించింది. గృహ పొదుపులు సంప్రదాయ సాధనాల నుంచి మార్కె ట్‌ ఆధారిత సాధనాలైన మ్యూచువల్‌ ఫండ్స్, యులి ప్‌లు, పెన్షన్‌ ఉత్పత్తుల వైపు మళ్లుతుండడం బీఎఫ్‌ఎస్‌ఐ సేవలకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు తెలిపింది.  

ఈ రంగాల వారికి డిమాండ్‌.. బ్యాంక్‌లు సేల్స్, రిలేషన్‌
షిప్‌ ఎగ్జిక్యూటివ్‌లు, డిజిటల్‌ ప్రొడక్ట్‌ మేనేజర్లు, క్రెడిట్‌ రిస్క్‌ అనలిస్టుల నియామకాలను పెంచినట్టు అడెకో ఇండియా నివేదిక వెల్లడించింది. బీమా సంస్థలు, సంపద నిర్వహణ సంస్థలు ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లు, డిజిటల్‌ అండర్‌రైటర్లు, క్లెయిమ్స్‌ అటోమేషన్‌ స్పెషలిస్టుల నియామకాలకు ప్రాధాన్యం పెంచినట్టు తెలిపింది. ఇందోర్, కోయింబత్తూర్, నాగర్‌పూర్, గువహటిలో 15–18 శాతం, సూరత్, జైపూర్, లక్నో, భువనేశ్వర్‌ పట్టణాల్లో నియామకాలు 11–13 శాతం పెరిగినట్టు పేర్కొంది. సేవలకు డిమాండ్‌ పెరుగుతుండడంతో 78 శాతం బీమా కంపెనీలు అదనపు నైపుణ్యాల కల్పనపై దృష్టి సారించినట్టు తెలిపింది. ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడులపై అవగాహన అన్నది మెట్రోలకు వెలుపల కూడా విస్తరిస్తోందని.. దీంతో స్థానిక నిపుణులకు డిమాండ్‌ పెరుగుతున్నట్టు తెలిపింది. 100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా అడెకో ఇండియా ఈ వివరాలను విడుదల చేసింది.   
 

Videos

ఎన్ని కేసులు పెట్టినా జగనన్న వెంటే నడుస్తాం..

Anantha Venkatarami Reddy: నీ తల్లి అయితే ఒకటి ఎన్టీఆర్ తల్లి అయితే మరొకటా

'ధర్మస్థల' కేసులో మరో భారీ ట్విస్ట్

మహిళపై చేయి చేసుకున్న ఎస్ఐ

జనాలకు అర్థమైంది..? ఏపీలో సాక్షి టీవీ కోసం డిమాండ్స్

Viral Video: వామ్మో..! కోబ్రాతో చెడుగుడు ఆడుకున్నబుడ్డోడు!

చైనాకు దగ్గరవుతోన్న భారత్? టిక్ టాక్ రీ ఎంట్రీ.. నిషేధంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

7 కోట్ల స్థలం 50 లక్షలకే.. ఆంధ్రజ్యోతికి ఇవ్వాలనుకొని బొక్క బోర్లాపడ్డ టీడీపీ

పాఠశాలలో పిల్ల ఏనుగు

కుక్కలతో మాట్లాడుతున్న రాజేష్

Photos

+5

ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)

+5

తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?