బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
వాహన విక్రయాలు.. స్లోడౌన్
Published on Sat, 08/02/2025 - 00:19
ముంబై: దేశీయంగా డిమాండ్ స్తబ్దత కొనసాగడంతో జూలైలోనూ వాహన విక్రయాలు నెమ్మదించాయి. దిగ్గజ ఆటో కంపెనీలైన మారుతీ సుజుకీ విక్రయాలు స్వల్పంగా పెరగ్గా.., హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు తగ్గాయి. మహీంద్రాఅండ్‌మహీంద్రా, కియా ఇండియా విక్రయాల్లో రెండంకెలు, ఒక అంకె వృద్ధి నమోదు చేశాయి. మారుతీ సుజుకీ దేశీయంగా జూలైలో 1,37,776 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది జూలైలో అమ్ముడైన 1,37,463 వాహనాలతో పోలిస్తే స్వల్పంగా 0.22% ఎక్కువ. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెస్సో విక్రయాలు 9,960 నుంచి 6,822 యూనిట్లకు తగ్గాయి.
→ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ అమ్మకాలు 10% క్షీణించి 43,973 యూనిట్లకు వచ్చి చేరింది. ‘వాహన పరిశ్రమ గత కొన్ని నెలలుగా డిమాండ్ లేమి పరిస్థితిని ఎదుర్కొంటోంది. పండుగ సీజన్‌పై ఆశావహంగా ఉన్నాం. పూర్తి స్థాయి సరఫరా, నూతన ఉత్పత్తులతో సిద్ధంగా ఉన్నాం’ అని హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు
మహీంద్రా యుటిలిటీ వాహన సేల్స్ 20% వృద్ధి తో 49,871 యూ నిట్లుగా నమోదైంది.
Tags : 1