Breaking News

నేపాల్‌లో రిలయన్స్‌ సాఫ్ట్‌డ్రింక్స్‌

Published on Tue, 07/15/2025 - 10:18

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ ‘కాంపా కోలా’ను నేపాల్‌ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందుకోసం కంపెనీ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (ఆర్‌సీపీఎల్‌), నేపాల్‌కి చెందిన చౌదరి గ్రూప్‌తో (సీజీ) ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫుడ్, బెవరేజెస్‌ విభాగంలో క్యాంపా ఉత్పత్తుల తయారీ, దేశవ్యాప్తంగా పంపిణీకి సీజీ తోడ్పడుతుంది.

కాంపా పోర్ట్‌ఫోలియో కింద తొలుత కాంపా కోలా, కాంపా లెమన్, కాంపా ఆరెంజ్, కాంపా ఎనర్జీ గోల్డ్‌ బూస్ట్, కాంపా ఎనర్జీ బెర్రీ కిక్‌ ఉత్పత్తులను ప్రవేశపెడతారు. ప్రాంతీయంగా మరింత వృద్ధి సాధించే దిశగా దీర్ఘకాలిక విజన్‌తో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు ఆర్‌సీపీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేతన్‌ మోదీ తెలిపారు. తమ బెవరేజ్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని సీజీ గ్రూప్‌ ఎండీ నిర్వాణ చౌదరి చెప్పారు. 

ఇదీ చదవండి: పీఎం కిసాన్‌ నిధి విడుదలకు డేట్‌ ఫిక్స్‌?

2022లో కాంపా బ్రాండ్‌ను రిలయన్స్‌ కొనుగోలు చేసింది. 2023లో దాన్ని దేశీ మార్కెట్లో సరికొత్తగా ప్రవేశపెట్టింది. అటు సీజీ గ్రూప్‌ అంతర్జాతీయంగా 200 పైగా కంపెనీలు, 260 పైచిలుకు బ్రాండ్లను నిర్వహిస్తూ నేపాల్‌లో అగ్రగామిగా నిలుస్తోంది. భారత్‌ సహా పలు దేశాల్లో అమ్ముడయ్యే ‘వై వై’ బ్రాండ్‌ ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ఈ సంస్థకు చెందినవే. 

#

Tags : 1

Videos

తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారు: కేటీఆర్

Buchepalli Siva Prasad Reddy : ఉప్పాల హారికకు అండగా ఉంటామని హామీ

Nalgonda : సినిమా రేంజ్ లో మర్డర్ ప్లాన్

చాపాడులో జరిగిన వైఎస్ MPP ఎన్నికల్లో YSRCP అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

Nimisha Priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ

YS Jagan: బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం సరికాదు

హిందీ భాష నేర్చుకోవడంలో తప్పు లేదు: YS జగన్

Jagadish Reddy: కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు

విజయవాడ గవర్నర్ పేటలో డబుల్ మర్డర్

భారత్ లోకి టెస్లా ఎంట్రీ వెనుక మస్క్ మాస్టర్ ప్లాన్

Photos

+5

తప్పు సరిదిద్దుకో చంద్రబాబూ.. రేపు టైం మాది గుర్తుంచుకో (ఫొటోలు)

+5

మహబూబ్‌నగర్‌ : బోనమెత్తిన పాలమూరు ..తరలివచ్చిన మహిళలు (ఫొటోలు)

+5

పీరియడ్‌ నొప్పి తగ్గాలంటే..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ తాన్య ప్రేమ కహానీ (ఫొటోలు)

+5

బ్రిట‌న్ కింగ్ చార్లెస్‌-3ను కలిసిన టీమిండియా (ఫొటోలు)

+5

వాణీ కపూర్‌ ‘మండల మర్డర్స్‌’ ట్రైలర్‌ విడుదల ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ముంబైలో ‘టెస్లా’ కార్ల తొలి షోరూమ్‌ ప్రారంభం (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్ టూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భార‌త క్రికెట‌ర్‌

+5

డల్లాస్ కన్సర్ట్‌లో దిల్‌రాజు దంపతులు సందడి (ఫొటోలు)