పెళ్లి తర్వాత మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు
Breaking News
కొండెక్కిన వెండి!
Published on Tue, 07/15/2025 - 01:48
న్యూఢిల్లీ: వెండి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరాయి. సోమవారం ఢిల్లీ మార్కెట్లో కిలోకి రూ.5,000 పెరగడంతో రూ.1,15,000 స్థాయిని నమోదు చేసింది. డాలర్ బలహీనతకు తోడు పెట్టుబడుల మద్దతు ర్యాలీకి దారితీసింది. గత శనివారం సైతం వెండి కిలోకి రూ.4,500 పెరగడం గమనార్హం. 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.200 లాభపడి రూ.99,570కు చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత పసిడి సైతం ఇంతే మేర పెరగడంతో రూ.99,000 స్థాయిని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్‌కు 1.71 డాలర్లు పెరిగి 39 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం 3,353 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. ‘‘వెండి ధరలు దేశీ మార్కెట్లో సరికొత్త గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో 14 సంవత్సరాల గరిష్టానికి చేరాయి. బంగారానికి ప్రత్యామ్నాయ సాధనంగా వెండి పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడమే ఇందుకు దారితీసింది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ రూ.2,135 పెరిగి రూ.1,15,136 స్థాయికి చేరుకుంది.
Tags : 1