పెళ్లి తర్వాత మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు
Breaking News
ఐదేళ్ల ముందే 50 శాతం టార్గెట్ పూర్తి
Published on Mon, 07/14/2025 - 20:55
పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ కీలక మైలురాయిని చేరుకుంది. శిలాజేతర ఇంధన శక్తి సామర్థ్యాన్ని నిర్దేశించిన ఐదేళ్ల ముందే 50% లక్ష్యాన్ని సాధించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 484.8 గిగావాట్లు. ఇందులో 242.8 గిగావాట్లు గ్రీన్ వనరుల నుంచే వస్తుందన్నారు. దాంతో స్థాపిత సామర్థ్యంలో 50 శాతం శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తి నమోదవుతోంది.
ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?
దేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తిని పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ‘ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గ్రీన్ ఎకోసిస్టమ్‌ను గణనీయంగా పెంచాలని నిర్ణయించుకున్నాం. దేశం మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 484.8 గిగావాట్లుగా ఉంది. అందులో శిలాజేతర ఇంధన వనరుల నుంచి 242.8 గిగావాట్లు సమకూరుతుంది’ అని జోషి ఎక్స్‌లో తెలిపారు. 2030 నాటికి భారత్ శిలాజేతర ఇంధన లక్ష్యంలో 50 శాతం ఐదేళ్లు ముందే సాధించింది.
Tags : 1