Breaking News

పెన్షన్‌ పథకాలకు పీవోపీలుగా మ్యూచువల్‌ ఫండ్స్‌ 

Published on Tue, 07/08/2025 - 06:34

న్యూఢిల్లీ: అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) లేదా వాటి సబ్సిడరీలు ఎన్‌పీఎస్‌ మాదిరి పెన్షన్‌ స్కీమ్‌లకు పాయింట్‌ ఆఫ్‌ ప్రెజెన్స్‌ (పీవోపీ) సేవలు అందించేందే దిశగా సెబీ కీలక ప్రతిపాదన చేసింది. అలాగే, ఏఎంసీలు తాము నిర్వహిస్తున్న ఫండ్స్‌కు సంబంధించి అంతర్జాతీయ డి్రస్టిబ్యూటర్లు లేదా అడ్వైజర్లుగానూ సేవలు అందించొచ్చన్న ప్రతిపాదన తీసుకొచి్చంది. 

ప్రస్తుతం ఏఎంసీలు, వాటి సబ్సిడరీలు తాము నిర్వహిస్తున్న ఫండ్స్‌కు సంబంధించి మాత్రమే నిర్వహణ, అడ్వైజరీ సేవలు అందించేందుకు అనుమతి ఉంది. ఏఎంసీల సబ్సిడరీలు పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్లుగా రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా.. పీవోపీ సేవలను ఆఫర్‌ చేస్తూ పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నుంచి కొంత పరిహారం అందుకోవచ్చని సెబీ తన తాజా ప్రతిపాదనల్లో పేర్కొంది.

 అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఏఎంసీలు చూడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఏఎంసీల సబ్సిడరీలు పెన్షన్‌ ఫండ్‌కు డైరెక్ట్‌ ప్లాన్‌ రూపంలోనే పీవోపీలుగా పనిచేసేందుకు అనుమతి ఉంది. దీనివల్ల పెన్షన్‌ ఫండ్‌ అడ్వైజరీ సేవలపై వాటికి ఎలాంటి కమీషన్‌ లభించడం లేదు. దీంతో సెబీ కొత్త ప్రతిపాదనలు తీసుకొచి్చంది. ఇక అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలతోపాటు ఇతర సేవలను సైతం ఏఎంసీలు ఆఫర్‌ చేసేందుకు సెబీ ప్రతిపాదించింది. వీటిపై ఈ నెల 28 వరకు ప్రజాభిప్రాయాలను సెబీ ఆహ్వానించింది.    

Videos

గుడివాడలో పచ్చ గూండాల ఉన్మాదం ఉప్పాల హారిక కారు పై దాడి

గుడివాడలో పచ్చ తాలిబన్ల పైశాచికం

Vijayawada: పనిమనిషే ప్రాణం తీసింది

గుడివాడలో టీడీపీ నాయకులు ఓవరాక్షన్ YSRCP నాయకులు స్ట్రాంగ్ కౌంటర్

ముదురుతున్న భాషా యుద్ధం

రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతలపై వైఎస్ జగన్ ఆగ్రహం

శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసు

కర్ణాటక యాదగిరిలోని గుల్జాపుర్ బ్రిడ్జి వద్ద దారుణం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై ప్రకాశ్ రాజ్ సెటైరికల్ పోస్ట్

Gannavaram Police Station: వల్లభనేని వంశీ లేటెస్ట్ విజువల్స్

Photos

+5

కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)

+5

అనంత్‌-రాధిక వివాహ వార్షికోత్సవం.. అంబరమంటిన పెళ్లికి అప్పుడే ఏడాది.. (ఫోటోలు)

+5

నోరూరించే పులస వచ్చేస్తోంది..రెడీనా! (ఫొటోలు)

+5

తెలంగాణలో ఈ అద్భుత ఆలయాన్ని దర్శించారా? (ఫొటోలు)

+5

నోవోటెల్‌ వేదికగా జేడీ డిజైన్‌ అవార్డ్స్‌ 2025 (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అమెరికా స్వాతంత్ర్య దిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

‘యువి కెన్‌’ ఫౌండేషన్ కార్య‌క్ర‌మంలో సంద‌డి చేసిన భార‌త ప్లేయ‌ర్లు (ఫోటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో వరుణ్‌తేజ్‌.. చాయ్‌ తాగుతూ (ఫోటోలు)

+5

గౌతమ్ కృష్ణ 'సోలో బాయ్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

మెటర్నిటీ ఫోటోషూట్‌, కలకాలం నిలిచిపోయే అందమైన భావోద్వేగం (ఫోటోలు)