Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు
Breaking News
ఈసారి ఆర్‌బీఐ డివిడెండ్ అదుర్స్..? త్వరలో నిర్ణయం
Published on Fri, 05/23/2025 - 14:03
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తన డివిడెండ్ చెల్లింపుల వివరాలను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిగులు బదలాయింపులను నియంత్రించే ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్ (ఈసీఎఫ్ )ను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. రికార్డు స్థాయి అంచనాలతో ఈ ఏడాది డివిడెండ్ గత ఏడాది బదిలీ చేసిన రూ.2.1 లక్షల కోట్లను అధిగమించే అవకాశం ఉంది.
రికార్డు స్థాయి డివిడెండ్ అంచనా
2023-24లో ఆర్‌బీఐ చారిత్రాత్మకంగా రూ.2.1 లక్షల కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇది 2022-23లో ఇచ్చిన రూ.87,416 కోట్లతో పోలిస్తే రెట్టింపు కంటే అధికంగా ఉండడం గమనార్హం. మే 23న ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో రాబోయే చెల్లింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. గతంలో చేసిన డివిడెండ్ చెల్లింపుల కంటే ఈసారి చెల్లింపులు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలకు మరింత మద్దతు ఇవ్వడాన్ని హైలైట్ చేస్తుంది.
ఇదీ చదవండి: ప్రమోషన్స్‌పై వరుస ప్రకటనలు చేస్తున్న టాప్ ఐటీ కంపెనీ
కేంద్ర బడ్జెట్ 2025లో ఆర్‌బీఐ ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్ ఆదాయం రూ.2.56 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్ (ఈసీఎఫ్) ఆర్‌బీఐ నుంచి బదిలీ చేయదగిన మిగులును నిర్ణయిస్తుంది. బిమల్ జలాన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా 2019 ఆగస్టు 26న మొదటిసారి ఆమోదించబడిన ఈసీఎఫ్ ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్‌లో 6.5-5.5% వద్ద నిర్వహించే కంటింజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్‌బీఐ) ద్వారా తగినంత రిస్క్ ప్రొవిజనింగ్‌ను నిర్ధారిస్తుంది.
Tags : 1