భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..
Breaking News
ప్రమోషన్స్‌పై వరుస ప్రకటనలు చేస్తున్న టాప్ ఐటీ కంపెనీ
Published on Fri, 05/23/2025 - 11:58
గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ జూన్ 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ సైకిల్‌ను ప్రకటిస్తున్నట్లు తెలిపిన రెండు రోజుల్లోనే మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే భారతదేశంలో 15,000 మందికి ప్రమోషన్ ఇస్తామని ప్రకటించింది. తాజాగా ఇండియాలోని మరో 43,000 మందికి ప్రమోషన్లు ఇస్తామని తెలిపింది. అదికూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేస్తామని పేర్కొంది.
గతంలో ఐటీ కన్సల్టింగ్ డిమాండ్ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులపై పరిశీలన పెరగడంతో ఇటీవల ప్రకటించిన ప్రమోషన్లలో ఆరు నెలలపాటు జాప్యం జరిగింది. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు నిలిచిపోయిన ప్రమోషన్లను జూన్‌లో ప్రకటిస్తామని తెలిపింది.
ఇదీ చదవండి: పసిడి ధర పతనం! తులం ఎంతంటే..
ఈమేరకు యాక్సెంచర్ ఇండియా సీనియర్ కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ అంతర్గత నోట్‌లో వివరాలు వెల్లడించారు. ట్రాన్సిషన్ పీరియడ్ కారణంగా 2024 డిసెంబర్‌లో భారత్‌కు చెందిన 30,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరం జూన్ 1 నాటికి యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 97,000 మందికి పదోన్నతి కల్పించిందన్నారు. వీరిలో 702 మంది మేనేజింగ్ డైరెక్టర్లు, 64 మంది సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారని తెలిపారు. యాక్సెంచర్‌కు ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది ఉద్యోగులున్నారు. భారత్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
Tags : 1