Breaking News

ఐటీసీ లాభం ఫ్లాట్‌

Published on Fri, 05/23/2025 - 06:29

ముంబై: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో పన్ను, అనూహ్య పద్దుకుముందు స్టాండెలోన్‌ నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 6,417 కోట్లకు చేరింది. సిగరెట్ల ఆదాయం పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా  తోడ్పడింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 6,288 కోట్లు ఆర్జించింది. హోటళ్ల బిజినెస్‌ విడదీత తదుపరి ఫలితాలివి. 

ఐటీసీ హోటళ్ల విడదీతతో రూ. 15,179 కోట్ల వన్‌టైమ్‌ లాభం అందుకుంది. పట్టణాలలో వినియోగం మందగించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ అమ్మకాలకు అండగా నిలిచినట్లు ఐటీసీ పేర్కొంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 7.85 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. సిగరెట్ల బిజినెస్‌ ద్వారా 4 శాతం అధికంగా రూ. 5,118 కోట్ల అమ్మకాలు సాధించింది. కన్జూమర్‌ బిజినెస్‌ ఆదాయం 4 శాతం వృద్ధితో రూ. 5,495 కోట్లను తాకింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం 9 శాతం ఎగసి రూ. 18,266 కోట్లను తాకింది.  

పూర్తి ఏడాదికి...
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 20,092 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023–24లో లాభం రూ.19,910 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 66,657 కోట్ల నుంచి రూ. 73,465 కోట్లకు జంప్‌ చేసింది. ఇక హోటళ్ల బిజినెస్‌ తొలి 9 నెలల్లో(ఏప్రిల్‌–డిసెంబర్‌ 2024) రికార్డ్‌ నెలకొల్పుతూ రూ. 573 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించినట్లు ఐటీసీ వెల్లడించింది. అనూహ్య పద్దుతోపాటు, పన్నుకు ముందు లాభమిది. హోటళ్ల బిజినెస్‌ను 2025 జనవరిలో విడదీయడం తెలిసిందే. 

ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్‌ఈలో 1.6 శాతం నష్టంతో రూ. 426 వద్ద ముగిసింది.  
 

#

Tags : 1

Videos

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

Photos

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)