జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం
Breaking News
భారీ ఐపీవోకి అవాడా గ్రూప్
Published on Tue, 05/06/2025 - 00:29
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ రంగానికి చెందిన అవాడా గ్రూప్‌లో భాగమైన సోలార్ మాడ్యూల్స్ తయారీ విభాగం భారీ ఐపీవో సన్నాహాల్లో ఉంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 4,000–5,000 కోట్ల వరకు సమీకరించడంపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవోని నిర్వహించేందుకు పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, న్యాయసేవల సంస్థలతో గ్రూప్ సంప్రదింపులు జరిపినట్లు వివరించాయి.
పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను 5 గిగావాట్ ఇంటిగ్రేటెడ్ సోలార్ మాడ్యూల్, సెల్ తయారీ ప్లాంటు నిర్మాణం సహా ఇతరత్రా పెట్టుబడుల కోసం సంస్థ వినియోగించనుంది. అవాడా గ్రూప్‌లో బ్రూక్‌ఫీల్డ్‌కి చెందిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఫండ్, థాయ్‌ల్యాండ్‌కి చెందిన జీపీఎస్‌సీ మొదలైనవి 1.3 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి.
సోలార్ మాడ్యూల్స్ తయారీ, పునరుత్పాదక విద్యుదుత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్, అమోనియా మొదలైన విభాగాల్లో గ్రూప్ కార్యకలాపాలు ఉన్నాయి. 2024లో పలు సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థలు ఐపీవో ద్వారా నిధులు సమీకరించగా, మరిన్ని ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ రూ. 2,830 కోట్లు, అక్టోబర్‌లో వారీ ఎనర్జీస్ రూ. 4,321 కోట్లు సమీకరించాయి.
Tags : 1