ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు ఇలా..

Published on Mon, 05/05/2025 - 14:26

న్యూఢిల్లీ: కీలక ఇంధనాలైన పెట్రోల్, డీజిల్‌ వినియోగం ఏప్రిల్‌లో పెరిగింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణత అనంతరం 4 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్‌లో డీజిల్‌ వినియోగం 8.23 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఏప్రిల్‌ నెల అమ్మకాలతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగినట్టు పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం (కేంద్ర పెట్రోలియం శాఖ పరిధిలోని) డేటా తెలియజేస్తోంది.

2023 ఏప్రిల్‌ నెల విక్రయాలతో పోల్చి చూసినా 5.3 శాతం మేర వినియోగం పెరిగింది. కరోనా ముందు నాటి సంవత్సరం 2019 ఏప్రిల్‌ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10.45 శాతం అధికం కావడం గమనించొచ్చు. కస్టమర్లు క్రమంగా ఎలక్ట్రిక్, పెట్రోల్‌ వేరియంట్ల వైపు మొగ్గు చూపిస్తుండడంతో డీజిల్‌ వినియోగంపై కొంత కాలంగా నెలకొన్న సందేహాలకు తాజా గణంకాలు తెరదించినట్టయింది. మొత్తం పెట్రోలియం ఇంధనాల్లో డీజిల్‌ వాటా 38 శాతంగా ఉంటుంది.

ఇక ఏప్రిల్‌ నెలలో పెట్రోల్‌ అమ్మకాలు సైతం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 4.6 శాతం పెరిగి 3.43 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా పెట్రోల్‌ అమ్మకాలు 19 శాతం వృద్ధిని నమోదు చేయగా, నాటి గరిష్ట పరిమితి మీద మెరుగైన వృద్ధి నమోదైంది. ఎల్‌పీజీ విక్రయాలు 6.7 శాతం పెరిగి 2.62 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్‌) అమ్మకాలు 3.25 శాతం తగ్గి 7,66,000 టన్నులుగా ఉన్నాయి.

#

Tags : 1

Videos

విజయవాడ దుర్గమ్మ గుడికి కరెంటు బంద్.. ఆలయ చరిత్రలో తొలిసారి..

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? పెమ్మసానికి బిగ్ షాక్

పుష్ప-2 తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. A11గా అల్లు అర్జున్

గొంతు కోసిన మాంజా.. యువకుడికి 19 కుట్లు!

నారాయణ మోసం వల్లే అమరావతి రైతు మృతి.. రామారావుకు YSRCP నివాళి

ఇటువంటి మోసగాళ్లను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు

ఒళ్ళు దగ్గర పెట్టుకో.. శివాజీ పై ప్రకాష్ రాజ్ ఫైర్

మాటలు జాగ్రత్త శివాజీ.. లైవ్ లో మహిళా కమిషన్ వార్నింగ్

ఈసారి ఇక కష్టమే.. పవన్ లో మొదలైన భయం

బాక్సాఫీస్ వార్ స్టార్ట్! 1000 కోట్ల బ్లాక్ బస్టర్ పై ఫోకస్

Photos

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)

+5

హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

శివాజీ ‘దండోరా’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు)