ఆరు గ్యారంటీలేమో కానీ..ఆరు నెలలకొకసారి సీఎం మారడం పక్కా : కేటీఆర్‌

Ktr Comments on Congress Party in Builders Federation Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ ః కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమో గానీ ఆరు నెలల కొకసారి సీఎం మారటం మాత్రం పక్కా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. తాజ్ డెక్కన్ హోటల్‌లో మంగళవారం  జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్(టీబీఎఫ్‌) సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కొంతమంది గిట్టని వాళ్ళు మేము ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు ఈ తొమ్మిదేళ్లలో కేసిఆర్ ఏం చేయలేదు అని మాట్లాడుతుంటారు. కానీ కేసిఆర్ ప్రజల మనిషి

స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యపడుతుంది. బోర్‌ కొట్టిందని ఎవరైనా ప్రభుత్వం మారాలని కోరుకుంటారా. అభివృద్ధి చేసేవాళ్లు మరికొంత కాలం ఉంటే తప్పేంటి. తొమ్మిదేళ్లలో మేం అసాధారణ విజయాలు సాధించాం. ఆరున్నర సంవత్సరాల మా పని తీరు, గత 65ఏళ్ల ప్రభుత్వాల పనితీరు మీరు గమనించారు. మూసీ నది సుందరీకరణ చేస్తాం అని కాంగ్రెస్ చెప్తోంది. మూసీ నది నాశనం చేసింది కాంగ్రెస్ కాదా? 

కాంగ్రెస్‌ పార్టీకి 11 సార్లు అవకాశం ఇస్తే ఏం పీకారు? మళ్లీ ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు?  కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత అక్కడి బిల్డర్స్ నుంచి కమిషన్ 40 నుంచి 400 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్‌లో అభివృద్ది ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది. వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపిస్తాం. 332 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మిస్తాం. ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య కొత్త హైదారాబాద్ నిర్మిస్తాం. తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌లో భూముల విలువ గతంలో కంటే 20 శాతం పెరిగింది. గతంలో వ్యవసాయ రంగం కుంటు పడింది. అందుకే ఆనాడు భూముల విలువ లేదు’ అని కేటీఆర్‌ తెలిపారు. 

ఇదీ చదవండి.. కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 12:49 IST
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట...
14-11-2023
Nov 14, 2023, 12:48 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చాలా విషయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బ్యాలెన్స్‌ తప్పాడని, ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో భయం...
14-11-2023
Nov 14, 2023, 12:14 IST
సాక్షి, జగిత్యాల: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటానని బీఆర్‌ఎస్‌ కోరుట్ల అభ్యర్థి డా.సంజయ్‌ అన్నారు. సోమవారం కోరుట్లలోని పట్టణంలోని...
14-11-2023
Nov 14, 2023, 11:53 IST
సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల...
14-11-2023
Nov 14, 2023, 11:40 IST
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల...
14-11-2023
Nov 14, 2023, 10:51 IST
కొల్లాపూర్‌: ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు.. ఓటర్లను తికమక పెట్టే చర్యలు సహజంగా మారిపోయాయి. కొల్లాపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవి...
14-11-2023
Nov 14, 2023, 10:28 IST
అచ్చంపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు...
14-11-2023
Nov 14, 2023, 10:25 IST
సాక్షి, కరీంనగర్: 'అన్నా.. తమ్మీ.. నామినేషన్‌ వేశావు.. ఈ 15 రోజుల్లో ప్రచారం చేసి, నువ్వు గెలిచేది లేదు.. ఏ ఉద్దేశంతో నామినేషన్‌...
14-11-2023
Nov 14, 2023, 10:11 IST
సాక్షి, ఖమ్మం: శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తికాగా, బరిలో మిగిలే అభ్యర్థులెవరో 15వ తేదీన తేలనుంది....
14-11-2023
Nov 14, 2023, 10:01 IST
సాక్షి, మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పిదం...
14-11-2023
Nov 14, 2023, 09:22 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి వచ్చే ఓట్లు తమకు నష్టం చేస్తాయా? మేలు చేస్తాయా? వారు...
14-11-2023
Nov 14, 2023, 08:09 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ...
14-11-2023
Nov 14, 2023, 08:04 IST
సాక్షి, కరీంనగర్‌: ఒకప్పుడు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, సత్తా చాటేవారు. ఉమ్మడి కరీంనగర్‌...
14-11-2023
Nov 14, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి,...
14-11-2023
Nov 14, 2023, 05:13 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేసన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:03 IST
సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రజలకు ‘మోదీ గ్యారంటీలు’పేరిట భరోసా కల్పించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:01 IST
ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు ‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్‌ ఉండాలంతే.. పంచ్‌ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్‌...
14-11-2023
Nov 14, 2023, 04:57 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 17న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 17న...
14-11-2023
Nov 14, 2023, 04:45 IST
ఎస్‌. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా...
14-11-2023
Nov 14, 2023, 04:32 IST
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా అధికారులు సవ్యంగా లేని 207 నామినేషన్లను తిరస్కరించారు.15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూటినీ...



 

Read also in:
Back to Top