Eid 2024 ఘుమ ఘుమల షీర్ కుర్మా టేస్టీ అండ్‌ హెల్దీగా ఇలా..! | Sakshi
Sakshi News home page

Eid 2024 ఘుమ ఘుమల షీర్ కుర్మా టేస్టీ అండ్‌ హెల్దీగా ఇలా..!

Published Thu, Apr 11 2024 10:47 AM

Eid 2024 Sheer Khurma Recipe for Ramadan - Sakshi

ఈద్ 2024:  ప్రపంచవ్యాప్తంగా  ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ  పవిత్ర రంజాన్‌.  నెలరోజుల ఉపవాస దీక్ష తరువాత చంద్ర దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సాహంగా జరుపుకుంటారు. నెలవంకతో ప్రారంభమై 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలు  తదుపరి నెల నెలవంకతో ముగుస్తాయి.  రంజాన్‌ పండుగ చేసుకుంటారు.  దీన్నే ఈద్ అని కూడా అంటారు. ఈ రోజున ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. తీపి విందు చేసుకుంటారు.


 ముఖ్యగా రంజాన్‌ అనగానే అందరికీ గుర్తు వచ్చేది  ఒకటి హలీం. రెండోది షీర్‌ ఖుర్మా.  షీర్ ఖుర్మా అనేది దక్షిణ ఆసియా నుండి వచ్చిన రుచికరమైన, వెల్వెట్ డెజర్ట్.  సేవయాన్ అని పిలిచే సున్నితమైన సెమోలినా నూడిల్. ఏలకులు , కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్,  వివిధ రకాల గింజలు, డ్రైఫ్రూట్స్‌తో ఎంతో రుచికరంగా తయారు చేస్తారు.  మరి షీర్‌ ఖుర్మా  రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా..!

షీర్ ఖుర్మాకు కావాల్సిన పదార్థాలు:
చిక్కని పాలు, సేమియా, చక్కెర, బాదం, జీడి పప్పు, పిస్తా, ఖర్జూరం, కిస్మిస్, నెయ్యి, కోవా, రోజ్ వాటర్,  కుంకుమ పువ్వు

తయారీ:
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకొద్దిగా నెయ్యి వేసి.. డ్రై ఫ్రూట్స్‌ వేసి వేయించుకొని పక్కన పెట్టు కోవాలి.  అదే కడాయిలో సేమియాను కూడా వేసి జాగ్రత్తగా  వేయించాలి.  ఆ తరువాత మరో గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి.  చిక్కగా మరిగాక మంట సిమ్‌లో పెట్టుకొని, ఇంకొంచెం మరిగాక  పంచదార పొడి, కోవా వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో అడుగంట కుండా కలుపుతూ ఉండటం మర్చిపోకూడదు.  

ర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న  ఖర్జూరాలను, సేమియాలను వేయాలి. ఇపుడిక ఊరికే కలపకూడదు. రోజ్ వాటర్ కూడా వేసి మెల్లిగా కలపాలి. కొద్దిగా చిక్కగా అయిన తరువాత దింపేసుకోవాలి. తరువాత ముందే వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌, కుంకుమ పువ్వు రేకలతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే టేస్టీ అండ్ హెల్దీ షీర్ కుర్మా సిద్ధం.  

*సాక్షి పాఠకులందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు*
 

Advertisement
 
Advertisement