Today Telugu Horoscope: ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు | Today Telugu Horoscope On December 6th, 2023: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు

Published Wed, Dec 6 2023 5:43 AM

horoscope today 06 12 2023 rasiphalalu telugu  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: బ.నవమి రా.12.48 వరకుతదుపరి దశమి, నక్షత్రం: ఉత్తర తె.5.10 వరకు (తెల్లవారితే గురువారం),  తదుపరి హస్త, వర్జ్యం: ఉ.10.35 నుండి 12.19 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.29 నుండి 12.17 వరకు, అమృత ఘడియలు: రా.9.06 నుండి 10.54 వరకు. యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు, రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు, సూర్యోదయం : 6.20, సూర్యాస్తమయం : 5.21.

మేషం... ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు,వస్త్రలాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. వ్యాపారాలు లాభిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు. ధనవ్యయం. 

మిథునం... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం... కుటుంబసౌఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటాయి.

సింహం... ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం.  వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

కన్య... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. నూతన విద్య, ఉద్యోగయోగాలు. కీలక నిర్ణయాలు.

తుల.... ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆలయాల సందర్శనం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు. 

వృశ్చికం... చర్చలు సఫలం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ధనుస్సు... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మకరం.... ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు.

కుంభం... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనుకోని సంఘటనలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

మీనం... పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

Advertisement
Advertisement