'గెలిచాం.. కానీ అసలైన సాయం ఇప్పుడు కావాలి' | Sakshi
Sakshi News home page

'గెలిచాం.. కానీ అసలైన సాయం ఇప్పుడు కావాలి'

Published Thu, Jul 9 2015 4:15 PM

'గెలిచాం.. కానీ అసలైన సాయం ఇప్పుడు కావాలి'

పాట్నా: డబ్బు ఉన్నవాళ్లకు చదువుండదు.. చదువొచ్చేవాళ్లకు డబ్బుండదు అనేది ఒక నానుడి. అయితే, డబ్బున్నవాడు అది అయిపోవడంతో ఆగిపోతాడేమోగానీ.. చదువున్నవాడు మాత్రం డబ్బు హెచ్చుతగ్గలవల్ల ఆగిపోడూ.. ఓ ప్రవాహంలా ముందుకు వెళుతూనే ఉంటాడు. అందుకోసం అనువైన మార్గాలు శోధిస్తాడు. సిగ్గు, బిడియం అనేది దరిచేరనీయరు.. ఎందుకంటే వారి లక్ష్యం ముందు ఇవన్నీ పూచిక పుల్లలు.

బీహార్లోని మ్యాథమేటిషియన్ అనంద్ కుమార్ ప్రతి ఏటా దాదాపు 30 మంది నిరుపేద పిల్లలకు రూపాయి తీసుకోకుండా ఐఐటీ కోచింగ్ ఇస్తున్నారు. కోచింగ్ తీసుకున్న వారంతా ఫలితాల్లో మెరుస్తున్నారు. అయితే, ఫలితాల్లో తమను విజయం వరిస్తుందన్న సంతోషం కన్నా.. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ ఉంటుంది.. అందుకు భారీ స్థాయిలో ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అసలే రెక్కాడితే డొక్కాడని తమ తల్లిదండ్రులు అంతమొత్తం ఎలా ఇవ్వాగలరనే ఆందోళన బాగా వేదిస్తోంది. దీంతో ఎలాగైన తమ కలను నెరవేర్చుకోవాలని, దేశంలోని విశిష్ట ఐఐటీ ఖరగ్పూర్లో చదవాలని ఆశపడుతున్నారు. దీంతో వారు తమ పరిస్థితిని ఏమాత్రం తడుముకోకుండా వివరిస్తూ మాకు సాయం చేయండి అంటూ వేడుకుంటున్నారు. ఇలాసాయం కోరుతున్న వారిలో కొందరిని ఉదాహరణగా తీసుకుంటే.. దనంజయ్ కుమార్ (18) అనే విద్యార్థి సూపర్ కంప్యూటర్ 30లో శిక్షణ తీసుకొని ఐఐటీ ర్యాంకు సాధించాడు.

అతడు ఇప్పుడు ఖరగ్పూర్ ఐఐటీ కౌన్సెలింగ్కు హాజరు కావాలంటే కనీసం 45 వేలు ఫీజు కట్టాలి. పోనీ బ్యాంకులను అడుగుదామా అంటే ప్రవేశం పత్రాన్ని తీసుకొచ్చాకే బ్యాంకులు లోన్ ఇస్తాయి. తన తండ్రి నెలకు సంపాధించేది కేవలం మూడువేల రూపాయలు. కానీ ఇంట్లో ఉంది మాత్రం ఎనిమిది మంది. వీటితో వారందరిని పోషించడమే కష్టం. అలాంటిది 45 వేలు కౌన్సెలింగ్ ఫీజు చెల్లించడమంటే సాధారణమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ధనంజయ్ కుమార్ తనను ఆదుకొని తన కల నెరవేర్చరూ అంటూ వేడుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యే మాదేపూర్ నుంచి సుజిత్ కుమార్, నలందా నుంచి ప్రేమ్ పాల్, ససరాం నుంచి శరవణ్ అనే విద్యార్థులంతా తమకు ఆర్థిక సాయం చేసి విద్యను కొనసాగించేలా ఆదుకోండంటూ కోరుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement