అందుకే ఈ విజయం | Sakshi
Sakshi News home page

అందుకే ఈ విజయం – జయ .బి

Published Sat, Sep 9 2017 12:55 AM

అందుకే ఈ విజయం

 – జయ .బి

యూనివర్సల్‌ పాయింట్‌తో తీసిన ‘వైశాఖం’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు సెంటిమెంట్‌ నచ్చింది. అందుకే ఇంతటి విజయం సాధ్యమైంది. పాటలు, ఫోటోగ్రఫీ కూడా ఈ విజయానికి దోహదపడ్డాయి. ఒక మంచి పాయింట్‌తో సినిమా తీశారని రిలీజ్‌ రోజు నుంచి అందరూ అభినందిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్‌ జయ బి. హరీష్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ 12 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా అర్ధ శతదినోత్సవం జరుపుకోవడానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు. మానవతా విలువల్ని మరోసారి గుర్తు చేశారంటూ సినిమా చూసిన వాళ్ళంతా మెచ్చుకోవడం ఆనందాన్ని కలిగించింది’’ అన్నారు.
8

Advertisement
 

తప్పక చదవండి

Advertisement