నా బ్యాగ్‌లో ఏమున్నాయంటే! | Sakshi
Sakshi News home page

నా బ్యాగ్‌లో ఏమున్నాయంటే!

Published Thu, Aug 17 2017 12:19 AM

నా బ్యాగ్‌లో ఏమున్నాయంటే!

కమల్‌హాసన్‌ నాస్తికుడు. కానీ, ఆయన మొదటి కూతురు శ్రుతీహాసన్‌కు మాత్రం దేవుడంటే నమ్మకం. ఏ రేంజ్‌లో నమ్ముతారంటే తన హ్యాండ్‌బాగ్‌లో ఇష్టదైవాలు శివపార్వతుల బొమ్మలు పెట్టుకున్నారు. శ్రుతి ఎక్కడికెళ్లినా హ్యాండ్‌ బ్యాగ్‌ కంపల్సరీగా తీసుకెళతారు. అందుకే శివపార్వతులు తనతోనే ఉన్నట్లు భావిస్తారామె. ఈ బ్యూటీ హ్యాండ్‌బాగ్‌లో ఇంకా ఏమేం ఉన్నాయనే విషయానికి వస్తే.. లిస్టు చాలానే ఉంది.

‘‘ఇంటి తాళాలు, హెడ్‌ఫోన్స్, క్రెడిట్‌ కార్డ్స్‌’’ తప్పకుండా ఉంటాయన్నారు శ్రుతి. మరి.. అమ్మాయిల బ్యాగులో అలంకార వస్తువులు ఉండాలి కదా? అంటే ‘‘అవి కూడా ఉన్నాయి. లిప్‌స్టిక్, పర్‌ఫ్యూమ్స్, హెయిర్‌ బ్యాండ్, అద్దం ఉంటాయి’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్‌. ఇవి మాత్రమే కాదు.. నోట్‌ప్యాడ్, సన్‌గ్లాసెస్‌ కూడా ఉంటాయి. అంతేనా? ‘లెన్సెస్‌’ కూడా కంపల్సరీ. మిగతా లిస్టులో ఏదొకటి మరచిపోయినా.. లెన్సులను మాత్రం శ్రుతి మరచిపోరు. ఎందుకంటే, అవి లేకపోతే సరిగ్గా కనపడదంటున్నారు శ్రుతీహాసన్‌.

Advertisement
 
Advertisement