ఒంగోలు : ముద్దులు మూటగట్టే తన పాప దారుణ హత్యకు గురైందన్న వార్త విని ...ఆరాధ్య తల్లి సాహితి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆరాధ్యా చనిపోలేదని... ఊరుకెళ్లిందంటూ ఆమె చెబుతున్న తీరు చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. అప్పటివరకూ తమ మధ్యే ఆడుకున్న చిన్నారి ... ఇకలేదనే విషయాన్ని...ఆరాధ్య కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరాధ్య బాబాయ్ లక్ష్మీనారాయణ ఎందుకిలా చేశాడో అంతు పట్టడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.
ఈ ఘటనపై చిన్నారి తాతయ్య నాగేంద్రరావు మాట్లాడుతూ ఆరాధ్యను తన చిన్నల్లుడు ఎందుకు హతమార్చాడో అర్థం కావటం లేదన్నారు. ఆరాధ్యను లక్ష్మీనారాయణ ముద్దు చేసేవాడని, ఎత్తుకుని ఆడించే వాడని అన్నారు. భార్యతో సన్నిహితంగా ఉండేందుకు పాప అడ్డుగా ఉందని చంపటం దారుణమన్నారు. ఇష్టం లేకుంటే వాళ్లు వేరే వెళ్లిపోతే సమస్య పరిష్కారం అయ్యేదని ఆయన అన్నారు.
అంతేకానీ పాపను చంపేంతగా కక్ష కడతాడనుకోలేదన్నారు. ఏమి ఆశించి ఈ పని చేశాడో తెలియటం లేదన్నారు. అయితే తమ మధ్య ఎలాంటి కుటుంబ విభేదాలు లేవని అన్నారు. పాప కనిపించకపోవటంతో పోలీసులు అందర్ని విచారించారని, అయితే తన చిన్నల్లుడిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తానే ఆరాధ్యను చంపేసినట్లు ఒప్పుకున్నాడని నాగేంద్రరావు తెలిపారు. కాగా ఆరాధ్య పిన్ని సింధు..లక్ష్మీనారాయణ ప్రేమ వివాహం చేసుకున్నారు. ముందు పెద్దలకు ఇష్టం లేకపోయినా అనంతరం వారు అంగీకరించటంతో ...అందరూ కలిసే ఉంటున్నారు.
ఆరాధ్య చనిపోలేదు... ఊరుకెళ్లింది
Published Wed, Nov 26 2014 11:27 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
Advertisement