ఆ ముగ్గురిలో.. హరి బతికే ఉన్నాడు.. | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురిలో.. హరి బతికే ఉన్నాడు..

Published Sat, Aug 1 2015 2:26 AM

ఆ ముగ్గురిలో..  హరి బతికే ఉన్నాడు..

అతను లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలుండాలని.. కొందరికైనా ప్రాణ దానం చేసి.. వారి జీవితాల్లో వెలుగు నింపాలని ఆ కుటుంబ సభ్యులు  భావించారు. మనస్ఫూర్తిగా గట్టి నిర్ణయం తీసుకున్నారు. పరోపకారార్థం ఇదం శరీరం.. అనే నానుడిని నిజం చేస్తూ.. తమ కుటుంబ సభ్యుడి మృతదేహం నుంచి అవయవాలను మ్రుగ్గురికి దానం చేసి తమ త్యాగాన్ని చాటుకున్నారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి.. గట్టి మేల్ తలపెట్టవోయ్.. అన్న మాటలకు వాస్తవ రూపమిచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన
 తగ్గువారిపల్లెకు చెందిన హరికృష్ణమనాయుడు అవయవాలను ఆయన కుటుంబ సభ్యుల ఆంగీకారం మేరకు  వేలూరు సీఎంసీ
 ఆస్పత్రి నుంచి చెన్నైకు తరలించారు.
 
బంగారుపాళెం:  వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందిన  వ్యాపారి హరికృష్ణమనాయుడు(55) అవయవాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. అతని గుండె, కిడ్నీలను వేలూరు నుంచి చెన్నైకి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు.  బం గారుపాళ్యం మండలం తగ్గువారిపల్లెకు చెందిన  హరికృష్ణమనాయుడు గత నెల 28న బంగారుపాళెం-అరగొండ రహదారి ఎంపీడీవో కార్యాలయం సమీపం లో మోటారు సైకిల్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది.ఈ ప్రమాదంలో తీవ్రంగా ఆయనతో పాటు అదే గ్రామానికి చెందిన సరోజమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విష మంగా ఉండటంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు హరికృష్ణమ నాయుడుకు బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధరించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన మృతి అనంతరం అతని అవయవాలు దానం చేసేందుకు ముం దుకొచ్చారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు అవయవాలను సేకరించారు. గుండెను చెన్నైలోని మలర్ ఆసుపత్రికి, ఒక కిడ్నీని మియట్ ఆసుపత్రికి, మరొక కిడ్నీని గునాపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీం తో శుక్రవారం ఉదయం 9.25 గంట లకు వేర్వేరు అంబులెన్స్ ద్వారా అవయవాలను చెన్నైకి తరలించారు.

అవయవాలను తీసుకెళ్లే సమయంలో ఎ లాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా వేలూ రు నుంచి చెన్నై కార్పొరేషన్‌లోని ఆసుపత్రి వరకు అంబులెన్స్‌లకు ముందుగా పెలైట్ వాహనాలు వెళ్లడంతో ఉదయం 11.10 గంటలకు బయలుదేరిన అంబులెన్సులు చెన్నైకి 1.45 గంటల సమయంలోనే చెన్నై ఆసుపత్రికి చేరాయి. అనంతరం మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి గుండెను అమర్చారు.  అదే విధంగా రెండు కిడ్నీలను వేర్వేరు ఆసుపత్రులకు అందజేశారు. అలాగే కళ్లు, లివర్‌ను సీఎంసీ ఆసుపత్రికి దానంగా అందజేశారు. అవయవాలు దానంగా పొందిన కుటుంబ సభ్యులు.. హరికృష్ణమనాయుడు  కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇతని  భార్య రాణియమ్మ. కుమార్తె జాన్సీప్రియ. ఈమె పుదుచ్చేరి జిప్‌మర్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తోంది. కుమారుడు అజయ్ విదేశాల్లో ఇంజినీర్‌గా పని చే స్తున్నాడు.
 

Advertisement
Advertisement