అంత మాట అంటాడా.. నీ ప్రియుడ్ని వదిలేయ్‌!

Women Suggested To Leave Her Boyfriend Over Tea - Sakshi

లండన్‌ : చాలామందికి తమకొచ్చిన కష్టాలను సోషల్‌మీడియా వేదికగా పది మందికి చెప్పుకోవటం.. వారినుంచి సలహాలు అడగటం మామూలైపోయింది. కొంతమంది నెటిజన్లు పక్కనోళ్ల సమస్యలపై స్పందిస్తూ పెద్ద మనిషి తరహాలో సలహాలు ఇస్తుంటారు. బ్రిటన్‌కు చెందిన ఓ యువతి పోస్టుపై కూడా ఇలాంటి స్పందనే వచ్చింది. ఆమె పోస్టుపై నెటిజన్లు ఎవరికి తోచినట్లు వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజులక్రితం ఓ బ్రిటీష్‌ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు కప్పు టీ ఇచ్చింది. అది తాగిన అతడు.. ‘‘ దీన్ని టీ అంటారా? చల్ల నీళ్లతో చేసిన చికెన్‌ సూపులా ఉంది’’ అంటూ మండిపడ్డాడు. దీంతో సదరు యువతి రెడ్డిట్‌ అనే సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌లో టీ కప్పు ఫొటొను షేర్‌ చేసింది.

తన బాయ్‌ఫ్రెండ్‌ అన్న మాటల్ని కాఫీ కప్పు కింద రాసుకొచ్చింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు..‘‘ అంత మాట అంటాడా.. నీ ప్రియుడ్ని వదిలేయ్‌!..’’ ‘‘ టీకి కూడా రక్తహీనత వస్తుందని నాకు తెలియదు’’.. ‘‘ పాలలో టీ పొడి వేయటం మర్చిపోయినట్లున్నావు’’.. ‘‘ నీ బాయ్‌ఫ్రెండ్‌ బాగానే ఉన్నాడుగా.. పాపం అతడు ప్రాణాల మీద ఆశను వదిలేసుకున్నట్లున్నాడు’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top