amp pages | Sakshi

LB Nagar: కామినేని ఫ్లైఓవర్ల కింద పార్కు

Published on Wed, 05/04/2022 - 17:34

సాక్షి, హైదరాబాద్‌: నడక మార్గాలు, ఫౌంటెన్లు, శిల్పాలు, కూర్చునే బెంచీలు, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక స్థలాలు, కెఫ్టేరియా.. ఇలా వివిధ సదుపాయాలతో ఆక్సిజన్‌ను అందించే పచ్చని మొక్కలతో ప్రత్యేక పార్కు త్వరలో నగర ప్రజలకు కనువిందు చేయనుంది.  ఇన్ని సదుపాయాలు కలిగిన పార్కు బహిరంగ ప్రదేశంలో కాకుండా రెండు ఫ్లైఓవర్ల కింద ఏర్పాటవుతుండటమే విశేషం. 

ఇప్పటికే  షేక్‌పేట, బహదూర్‌పురా ఫ్లైఓవర్ల కింద సైతం పచ్చదనం ఉన్నప్పటికీ దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఇన్ని సదుపాయాలతో కూడిన అతిపెద్ద ఉద్యానవనం ఇదే కానుంది. ఎల్‌బీనగర్‌ జోన్‌లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సివిల్‌ ఇంజినీరింగ్‌  పనులు జరుగుతున్న ఈ ప్రాంతంలో యాంఫీథియేటర్‌ సైతం రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌)

దాదాపు కోటి రూపాయల వ్యయమవుతున్న ఈ పార్కుకు ఆక్సిజన్‌ పార్కుగా నామకరణం చేయనున్నారు. పరిసరాల్లో నివసించే ప్రజలకే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ మార్గంలో ప్రయాణించే వారికి సైతం పచ్చదనంతో కనువిందు చేయడంతోపాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించనుంది. ఖాళీ ప్రదేశాలను ప్రయోజనకరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ జీవవైవిధ్య విభాగం(యూబీడీ) డిజైన్‌ చేసిన ఈ ఆలోచన.. ఫ్లైఓవర్ల కింద పూర్తిస్థాయి పార్కు రాష్ట్రంలో ఇదే ప్రథమం.  (క్లిక్: ఆర్టీసీకి ఆర్డరిస్తే మీ ఇంటికే బంగినపల్లి)

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)