ఎదురులేని జొకోవిచ్‌.. వింబుల్డన్‌లో 13వసారి..!

Published on Tue, 07/05/2022 - 07:12

లండన్‌: వరుసగా నాలుగోసారి వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ సాధించే దిశగా టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ 13వసారి ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 6–2, 4–6, 6–1, 6–2తో టిమ్‌ వాన్‌ రితోవెన్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించాడు.

ఆరుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్‌ 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్‌ నిక్‌ కిరియోస్‌ 4–6, 6–4, 7–6 (7/2), 3–6, 6–2తో నకషిమా (అమెరికా)పై నెగ్గి 2014 తర్వాత మళ్లీ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోగా... టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) 6–3, 6–1, 6–4తో కుబ్లెర్‌ (ఆస్ట్రేలియా)పై, క్రిస్టియన్‌ గారిన్‌ (చిలీ) 2–6, 5–7, 7–6 (7/3), 6–4, 7–6 (10–6)తో డిమినార్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గి తొలిసారి తమ కెరీర్‌లో ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత పొందారు.  

మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా), మూడో సీడ్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనిసియా), రిబాకినా (కజకిస్తాన్‌), అని సిమోవా (అమెరికా), తొమ్లాజనోవిచ్‌ (ఆస్ట్రేలి యా) క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ