amp pages | Sakshi

'పేడ మొహాలు,చెత్త గేమ్‌‌ప్లే అంటూ..'

Published on Sat, 12/12/2020 - 11:16

సిడ్నీ : టీమిండియా గబ్బర్‌.. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోపై ఒక నెటిజన్‌ పెట్టిన కామెంట్‌పై ధీటుగా కౌంటర్‌ ఇచ్చాడు. అసలు విషయంలోకి వెళితే.. ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత ధవన్‌ టెస్టు జట్టుకు ఎంపికకాని మిగతా ఆటగాళ్లతో స్వదేశానికి పయనమయ్యాడు. కాగా విమాన ప్రయాణంలో ధవన్‌ తన సహచరులైన దీపక్‌ చహర్‌, యజ్వేంద్ర చహల్‌లతో కలిసి సరదాగా ఫోటో దిగాడు. దానిని గబ్బర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి 'కళ్లలోని గుడ్లు పీకేసి గోలీలాట ఆడుతామంటూ' సరదాగా క్యాప్షన్‌ జత చేశాడు. (చదవండి : బుమ్రా షాట్‌.. ఆసీస్‌ బౌలర్‌కు గాయం)

ధవన్‌ పోస్టుపై ఒక నెటిజన్‌ వ్యంగంగా స్పందించాడు.'ఈ వేషాలకు ఏం తక్కువ లేదు..పేడ మొహాలు,చెత్త గేమ్‌‌ప్లే' అంటూ కామెంట్‌ చేశాడు.నెటిజన్‌ కామెంట్‌పై స్పందించిన ధవన్‌..' అవును .. మీ ఇంట్లో నీ గురించి కూడా ఇదే అనుకుంటున్నారంటూ' ధీటుగా బదులిచ్చాడు. ప్రస్తుతం శిఖర్‌ ధవన్‌ కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

శిఖర్‌ ధవన్‌ ఆసీస్‌ టూర్‌లో పర్వాలేదనపించే ప్రదర్శనను నమోదు చేశాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున టాప్‌ స్కోరర్‌గా.. ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచిన గబ్బర్‌.. ఆసీస్‌ టూర్‌లో మూడు వన్డేలు కలిపి 120 పరుగులు.. మూడు టీ20లు కలిపి 82 పరుగులు సాధించాడు. అంతేగాక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా ధవన్‌ నిలిచాడు. కాగా ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక కాని ధవన్‌ ఫిబ్రవరి 2021లో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. (చదవండి : రోహిత్‌ శర్మకు లైన్‌ క్లియర్‌)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)