amp pages | Sakshi

BGT 2023: స్మిత్‌ను 6 సార్లు అవుట్‌ చేశా! అశ్విన్‌ పాదాలకు నమస్కరిస్తే.. వెంటనే

Published on Wed, 02/08/2023 - 12:30

BGT 2023 Mahesh Pithiya- Ravichandran Ashwin: గుజరాత్‌ యువ క్రికెటర్‌ మహేశ్‌ పితియా తన ఆరాధ్య బౌలర్‌ రవిచంద్ర అశ్విన్‌ను కలిశాడు. టీమిండియా ప్రధాన స్పిన్నర్‌ అశూతో కలిసి ఫొటోలు దిగాడు. తనకు ఆదర్శప్రాయుడైన అశ్విన్‌ నుంచి ఆశీసులు అందుకున్నాననంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో బరోడా బౌలర్‌ మహేశ్‌ పితియా ఒక్కసారిగా స్టార్‌ అయిపోయిన సంగతి తెలిసిందే.

అశూ డూప్లికేట్‌
టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మహేశ్‌తో కలిసి ఆస్ట్రేలియా బ్యాటర్లు నెట్స్‌లో ప్రాక్టీసు చేయడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాదిరి బౌలింగ్‌ చేయగల మహేశ్‌ ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ ఆశ్రయించడం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. 

దీంతో.. అశ్విన్‌ డూప్లికేట్‌ అంటూ అతడి పేరు సోషల్‌ మీడియాలో మారుమ్రోగిపోయింది. ఇక ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీసులో తలమునకలయ్యాయి. 

స్మిత్‌ను ఆరుసార్లు అవుట్‌ చేశా
ఈ సందర్భంగా మంగళవారం మహేశ్‌ పితియా అశ్విన్‌ను కలిశాడు. అశ్విన్‌ను పట్ల తనకున్న అభిమానం, ఆసీస్‌ జట్టుతో ప్రయాణంలో తన అనుభవాలు పంచుకున్నాడు. న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘నెట్స్‌లో మొదటిరోజు స్టీవ్‌ స్మిత్‌ను కనీసం ఆరుసార్లు అవుట్‌ చేసి ఉంటా.

ఈ రోజు నేను నా రోల్‌మోడల్‌ అశ్విన్‌ నుంచి ఆశీర్వాదాలు పొందాను. తనలాగే బౌలింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా. నెట్స్‌లోకి వెళ్లేటపుడు నేను ఆయను కలిశాను. పాదాలకు నమస్కరించి ఆశీసులు అందుకున్నా.

కోహ్లి బెస్టాఫ్‌ లక్‌ చెప్పాడు
వెంటనే ఆయన నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. నేను ఆస్ట్రేలియన్లకు ఎలా బౌలింగ్‌ చేశానో అడిగితెలుసుకున్నాడు. పక్కనే విరాట్‌ కోహ్లి కూడా చిరునవ్వుతోనే నన్ను పలకరించాడు. నాకు బెస్టాఫ్‌ లక్‌ చెప్పాడు’’ అని మహేశ్‌ పితియా హర్షం వ్యక్తం చేశాడు. 

అదే విధంగా.. ‘‘ఆస్ట్రేలియా జట్టుతో ప్రయాణం అద్భుతంగా సాగింది. ప్రధానంగా స్టీవ్‌ స్మిత్‌కే నేను నెట్స్‌లో ఎక్కువగా బౌలింగ్‌ చేశాను. అయినా, స్మిత్‌ నాకిలానే కావాలని పట్టుబట్టలేదు. ఎలా బౌలింగ్‌ చేసినా ఎదుర్కొనేందుకు ట్రై చేసేవాడు.

అయితే, ఆ జట్టు స్పిన్నర్‌ లియోన్‌ మాత్రం నా దగ్గరికి వచ్చి నా బౌలింగ్‌ స్టైల్‌ను గమనించేవాడు. బంతిని డెలివరీ చేసేటపుడు నా వేళ్లను ఎలా తిప్పుతున్నా, గ్రిప్‌ ఎలా సాధిస్తున్నా అని పరిశీలించేవాడు. అంతేగాకుండా నాకు కొన్ని విలువైన సూచనలు, సలహాలు కూడా ఇచ్చేవాడు’’ అని మహేశ్‌ పితియా చెప్పుకొచ్చాడు.

చదవండి: Ajinkya Rahane: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో
 Asha Kiran: కడు పేదరికం.. రూ. 1000 పెన్షనే ఆధారం.. చెప్పుల్లేకుండా రోజూ 7 కిమీ పరుగు.. స్వర్ణ పతకాలతో..

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)